నవీన్ చంద్ర హీరోగా నటించిన 28 డిగ్రీ సెల్సియస్ (28 Degree Celsius) చిత్రం ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్ ద్వారా ఈ మూవీ బాగానే ఆసక్తిని రేపింది. అయితే, రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆశించిన రేంజ్‍లో కలెక్షన్లు రాలేదు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రానికి అనిల్ విశ్వంత్ దర్శకత్వం వహించారు. ఈ 28 డిగ్రీ సెల్సియస్ చిత్రం ఇప్పుడు సడెన్‍గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
28 డిగ్రీ సెల్సియస్ చిత్రం నేడు (ఏప్రిల్ 29) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తుగా ప్రకటన చేయకుండా సడెన్‍గా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ప్రస్తుతం ఈ మూవీ తెలుగులో ఒక్కటే అందుబాటులోకి వచ్చింది.
థియేటర్లలో రిలీజై నాలుగు వారాలు దాటకముందే ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది 28 డిగ్రీ సెల్సియస్. ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ఊహించినట్టు సాగలేదు. ప్రమోషన్లను బాగానే చేసినా టాక్ సరిగా లేకపోవటంతో కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఈ మూవీ ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు.
28 డిగ్రీ సెల్సియస్ సినిమా విభిన్నమైన స్టోరీలైన్‍తో వచ్చింది. శరీరంలో ఉష్ణోగ్రత కచ్చితంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉంటేనే అంజలి సేఫ్‍గా ఉంటుందని, లేకపోతే రిస్క్ అనే కథాంశంతో తెరకెక్కింది.
అనాథగా ఉండే కార్తీక్ (నవీన్ చంద్ర).. అంజలి (షాలినీ)ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత అంజలి కూడా ఓకే చెబుతుంది. కానీ అంజలి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోరు. దీంతో కార్తీక్, అంజలి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే, అంజలి ఓ అరుదైన బ్రెయిన్ ఇంజూరీతో బాధపడుతుంది. ఆమె సేఫ్‍గా జీవించాలంటే కచ్చితంగా శరీరంలో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో అంజలిని సేఫ్‍గా చూసుకునేందుకు కార్తీక్ ఏం చేశాడు? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? జార్జియాకు ట్రీట్‍మెంట్‍కు వెళ్లాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేది ఈ సినిమాలో ఉంటాయి.
28 డిగ్రీ సెల్సియస్ చిత్రాన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్‍తో తెరకెక్కించారు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్. కానీ నరేషన్ ఆస్థాయిలో మెప్పించలేదు. కొన్నిచోట్ల థ్రిల్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే కొత్త కథతో మంచి ప్రయత్నం చేశారు. ఓసారి చూడొచ్చు.
28 డిగ్రీ సెల్సియస్ మూవీలో నవీన్ చంద్ర, శాలినీతో పాటు ప్రియదర్శి, వైవా హర్ష, రాజా రవీంద్ర, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషించారు. సాయి అభిషేక్ నిర్మించిన ఈ మూవీకి శరవణన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం