వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో నవీన్ చంద్ర. రీసెంట్‌గానే 28 డిగ్రీ సెల్సియస్, లెవెన్ వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరించిన నవీన్ చంద్ర నటించిన న్యూ మూవీ కరాలి. ఈ సినిమాకు మందలపు శివకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీతో ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చారు.
శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన కరాలి మూవీలో నవీన్ చంద్రకు జోడీగా రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. మందలపు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం కరాలికి రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు.
కరాలి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారం (మే 18) నాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేశారు.
ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత మందలపు శివకృష్ణ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
కరాలి మూవీ నిర్మాత మందలపు శివకృష్ణ మాట్లాడుతూ.. "నేను కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగిని. అక్కడ వీఆర్ఎస్ తీసుకుని సినిమాల మీద ప్యాషన్‌తో ఇంత వరకు కూడబెట్టుకున్న డబ్బులతో ఇక్కడకు వచ్చాను. నాకున్న ప్యాషన్‌తోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను" అని అన్నారు.
"ఆ సమయంలోనే రాకేష్ పొట్ట గారు ఈ కథను చెప్పారు. నాకు ఆ కథ చాలా నచ్చింది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం. కొత్త యాక్షన్ మూవీని అందరి ముందుకు తీసుకు వస్తాం. నాకు ఇది ఫస్ట్ మూవీ అయినా సరే నా మీద నమ్మకంతో ముందుకు వచ్చిన హీరో నవీన్ చంద్ర గారికి థాంక్స్" అని కరాలి ప్రొడ్యూసర్ మందలపు శివకృష్ణ చెప్పారు.
ఇదిలా ఉంటే, నవీన్ చంద్ర 28 డిగ్రీ సెల్సియస్ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో 28 డిగ్రీ సెల్సియస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన లెవెన్ సినిమా మంచి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అని ప్రశంసలు తెచ్చుకుంటోంది.
సంబంధిత కథనం