సీరియల్ కిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలెవెన్ - ట్రైల‌ర్ రిలీజ్‌ చేసిన క‌మ‌ల్‌హాస‌న్ - హీరోయినే ప్రొడ్యూస‌ర్‌-naveen chandra eleven movie trailer unveiled by kamal haasan heroine reya hari produced this thriller movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సీరియల్ కిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలెవెన్ - ట్రైల‌ర్ రిలీజ్‌ చేసిన క‌మ‌ల్‌హాస‌న్ - హీరోయినే ప్రొడ్యూస‌ర్‌

సీరియల్ కిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలెవెన్ - ట్రైల‌ర్ రిలీజ్‌ చేసిన క‌మ‌ల్‌హాస‌న్ - హీరోయినే ప్రొడ్యూస‌ర్‌

Nelki Naresh HT Telugu

న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తోన్న సైకో కిల్ల‌ర్ మూవీ ఎలెవెన్ మే 16న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఉల‌గ‌నాయ‌క‌న్ క‌మ‌ల్‌హాస‌న్ రిలీజ్ చేశాడు. ఎలెవెన్ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తూనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది రేయా హ‌రి.

ఎలెవెన్ ట్రైల‌ర్‌

నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, త‌మిళ బైలింగ్వల్ ఇన్వేస్టిగేటివ్‌ థ్రిల్లర్ మూవీ ఎలెవెన్. సైకో కిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి లోకేశ్ అజ్ల్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎలెవెన్ ట్రైల‌ర్‌ను ఉల‌గ‌నాయ‌క‌న్ క‌మ‌ల్‌హాస‌న్ రిలీజ్ చేశారు. ఓ ఫైర్ యాక్సిడెంట్ తో ఇంట్రెస్టింగ్‌గా మొద‌లైన ట్రైల‌ర్‌ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.

ఎనిమిది హ‌త్య‌లు...

'లాస్ట్ ఇయర్ వైజాగ్ లో వరుసగా ఎనిమిది హత్యలు జరిగాయి. సీరియల్ కిల్లింగ్స్' అనే ఇంటెన్స్ డైలాగ్ తో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నవీన్ చంద్ర ఈ ట్రైల‌ర్‌లో క‌నిపించారు. 'సైకో కిల్లర్ విత్ అన్ బిలివబుల్ ఐక్యూ'అనే డైలాగ్ సైకో కిల్లర్ క్యారెక్టర్ చుట్టూ సస్పెన్ ని మరింతగా పెంచింది.

ట్రైల‌ర్‌లోని విజువ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆస‌క్తిని పంచుతోన్నాయి. నిక్టోఫోబియా అనే స‌మ‌స్య‌ను గురించి ట్రైల‌ర్‌లో ట‌చ్ చేశారు. ఇన్వేస్టిగేటివ్ సీన్స్ కొత్త‌గా ఉన్నాయి. ట్రైల‌ర్‌లో నవీన్ చంద్ర ఇంటెన్స్ యాక్టింగ్‌, సీరియల్ కిల్లింగ్ బ్యాక్‌ డ్రాప్, డైరెక్టర్ లోకేశ్ అజ్ల్స్ గ్రిప్పింగ్ టేకింగ్ హైలైట్‌గా నిలిచాయి.

రేయా హ‌రి హీరోయిన్‌...

ఈ వేసవిలో ఎలెవెన్ మూవీ అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి థియేట‌ర్ల‌లోకి రాబోతోంద‌ని మేక‌ర్స్ అన్నారు. ఎలెవ‌న్ మూవీలో రేయా హరి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాకు ఓ ప్రొడ్యూస‌ర్‌గా కూడా రేయా హ‌రి వ్య‌వ‌హ‌రిస్తోంది. అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు ట్రైలర్ లో కీలక పాత్రలలో ఆకట్టుకున్నారు.ఈ సినిమాకు డి. ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటింగ్‌ను స‌మ‌కూర్చుతున్నాడు.

సుంద‌రి సి వ‌ద్ద‌...

డైరెక్ట‌ర్‌గా లోకేశ్ కు ఇదే మొద‌టి మూవీ. గ‌తంలో సుంద‌రి సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు లోకేష్‌. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్ తో క‌లిసి హీరోయిన్ రేయా హరి ఎలెవెన్ సినిమాను నిర్మిస్తోంది.

గ‌తంలో ఈ బ్యాన‌ర్‌లో సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి వంటి సినిమాల‌చ్చాయి. సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్‌లో రేయా హ‌రి హీరోయిన్‌గా న‌టించింది.

మే 16న రిలీజ్‌...

డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఎలెవ‌న్ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 16న తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో ఎలెవెన్ మూవీ రిలీజ్ కాబోతుంది.

గేమ్ ఛేంజ‌ర్‌...

స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస‌గా అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటున్నాడు న‌వీన్ చంద్ర‌. ఈ ఏడాది రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. హీరోగా 28 డిగ్రీ సెల్సియ‌స్ అనే మూవీ చేశాడు. న‌వీన్ చంద్ర లీడ్ రోల్‌లో న‌టించిన ఇన్స్‌పెక్ట‌ర్ రిషి వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ రాబోతోంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం