Naveen Chandra About 28 Degree Celsius OTT Offers: ఓటీటీ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఆ తర్వాత కీలక పాత్రలు, విలన్ రోల్స్‌తో మెప్పించాడు. ఇన్‌స్పెక్టర్ రిషి వంటి హారర్, క్రైమ్ థ్రిల్లర్, పరంపర సిరీస్‌లతో మరింత పేరు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర.
డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో అలరించే నవీన్ చంద్ర నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ 28 డిగ్రీ సెల్సియస్. అందాల రాక్షసి తర్వాత నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా ఇది. దీనికి పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. పొలిమేర కంటే ముందు మొదటిసారి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమా 28 డిగ్రీ సెల్సియస్.
వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మించిన 28°C సినిమా రీసెంట్‌గా ఏప్రిల్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, మూవీ రిలీజ్‌కు ముందు పలు ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న నవీన్ చంద్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్, 28 డిగ్రీ సెల్సియస్ ఓటీటీ ఆఫర్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
- ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్‌లకు ఇబ్బందులు తప్పవు. ఆ టైమ్‌లో నా మూవీస్ కొన్ని ఆడకపోవడం వల్ల 28°C సినిమాకు మంచి బిజినెస్ జరగలేదు. అప్పటికి థ్రిల్లర్ జోనర్ మూవీస్ ఇంతగా లేవు.
- ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ (డాక్టర్ అనిల్ విశ్వనాథ్) గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు. పైగా మా మూవీని థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనే పట్టుదల మా డైరెక్టర్ అనిల్, ప్రొడ్యూసర్ సాయి అభిషేక్‌లో ఉండేది.
- పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు 28°C సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు.
- 28 డిగ్రీ సెల్సియస్ సినిమా థియేటర్‌లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మంచి ఓపెనింగ్స్ వచ్చి, ఆడియెన్స్ మౌత్ టాక్‌తో థియేటర్స్‌లో మూవీ ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. నా క్యారెక్టర్ వరకు ఎంత బాగా పర్‌ఫార్మ్ చేయాలో అంత బాగా పర్‌ఫార్మ్ చేశాను.
సంబంధిత కథనం