Rashmika Mandanna: రష్మిక మందన్నా ఫేవరెట్ కే-డ్రామాలు ఇవేనట.. మీరు ఎన్ని చూశారు?
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఫేవరెట్ కొరియన్ డ్రామాస్, చైనీస్ డ్రామాస్ లిస్ట్ గురించి వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన ఆమె.. ఈ సందర్భంగా తన ఫేవరెట్ కే-డ్రామాస్ గురించి తెలిపింది.
Rashmika Mandanna: రష్మిక మందన్నా ప్రస్తుతం మూడు పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన జోరులో ఉంది. ఇక ఈ ఆదివారం (మార్చి 30) సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సికందర్ మూవీతో రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించింది. ఇందులో తనకు ఇష్టమైన కొరియన్ డ్రామాలు ఏవో ఆమె చెప్పుకొచ్చింది.
రష్మిక మందన్నా ఫేవరెట్ కొరియన్ డ్రామాస్ ఇవే
కొరియన్ డ్రామాస్ కొన్నాళ్లుగా ఇండియన్ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ వినియోగం పెరిగిన తర్వాత.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ తో వచ్చే కే డ్రామాలు ఆకట్టుకుంటున్నాయి. సాధారణ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా వీటికి ఫిదా అవుతున్నారు.
దీనికి తాజా ఉదాహరణ రష్మిక మందన్నా. ఆమె ఈ మధ్య అభిమానులతో మాట్లాడుతూ.. తనకు కొరియన్ డ్రామాలతోపాటు చైనీస్ డ్రామాలంటే కూడా ఇష్టమని చెప్పింది. నెట్ ఫ్లిక్స్ లో జరిగిన ఓ సెషన్ లో ఓ అభిమాని మంచి కే-డ్రామాలు సూచించమని అడగ్గా.. 'నేను ఇప్పుడే 'లవ్ స్కౌట్ ' సినిమా చూశాను అని రష్మిక చెప్పింది. ఈ 'లవ్ స్కౌట్' మూవీ ఈ ఏడాది జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
రష్మిక ఇంకా ఏం చెప్పిందంటే..
తనకు కొరియన్ డ్రామాలతో పాటు చైనీస్ డ్రామాలు కూడా ఇష్టమని రష్మిక మందన్నా చెప్పింది. 'ది ఫస్ట్ ఫ్రాస్ట్' అంటే నాకు చాలా ఇష్టం అని ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె రాసుకొచ్చింది. ఈ సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఇక ప్రస్తుతం తాను 'అండర్ కవర్ హైస్కూల్' సినిమా చూస్తున్నానని కూడా రష్మిక తెలిపింది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
మరో అభిమాని రష్మికను మీకు ఇష్టమైన కొరియన్ డ్రామా ఏంటని అడిగాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నేను దాదాపు ప్రతి సిరీస్ చూశాను కాబట్టి ఎంచుకోవడం చాలా కష్టం. కానీ నేను నిజంగా ఎంచుకోవాల్సి వస్తే, ‘ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే’ని ఎంచుకుంటాను’ అని రష్మి చెప్పింది. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
రష్మిక మందన్నా 2023 నుంచి మాంచి ఊపులో ఉంది. ఆ ఏడాది చివర్లో యానిమల్ తో పాన్ ఇండియా హిట్ కొట్టింది. ఆ తర్వాత గతేడాది పుష్ప 2తో మరో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటికే ఛావాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మురగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ తో రాబోతోంది.
సంబంధిత కథనం