Tamil OTT: ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ మూవీ - సినిమా కష్టాలపై మరో కోణం
Tamil OTT: నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ మూవీ టూలెట్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో సంతోష్ శ్రీరామ్, శీలా రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ మూవీ టూ లెట్ ఓటీటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.2019లో రిలీజైన ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నది.
చాలా రోజుల పాటు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. రైట్స్ గడువు ముగియడంతో అమెజాన్ ప్రైమ్ నుంచి తొలగించారు. తిరిగి మళ్లీ అదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టూలెట్ మూవీ రిలీజైంది.
బెస్ట్ తమిళ మూవీగా..
65వ నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ తమిళ మూవీగా టూలెట్ అవార్డును అందుకున్నది. ఇఫీతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ కావడమే కాకుండా అనేక అవార్డులను సొంతం చేసుకున్నది. టూలెట్ మూవీలో సంతోష్ శ్రీరామ్, శీలా రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.
చెలియాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌తో పాటు హీరోహీరోయిన్లకు ఇదే ఫస్ట్ మూవీ కావడం గమనార్హం. అవార్డులతో పాటు కమర్షియల్ సక్సెస్‌గా ఈ మూవీ నిలిచింది. రియలిస్టిక్ మూవీగా ప్రేక్షకుల మెప్పును పొందింది. యాక్టింగ్, స్టోరీ విషయంలో ప్రశంసలు దక్కాయి. టూలెట్ మూవీకి ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ వచ్చింది.
అసిస్టెంట్ డైరెక్టర్...
సినిమా ఇండస్ట్రీలో సెటిలైన వారి కష్టాలను మరో కోణంలో టూలెట్ మూవీలో దర్శకుడు చూపించాడు. ఇల్లంగో సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. తక్కువ జీవితంతో బతుకుబండిని నడిపిస్తుంటాడు. భార్య అముద, కొడుకు సిద్ధార్థ్‌తో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటుంటాడు ఇల్లంగో . ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా రెంట్ ఇస్తామని చెప్పడంతో ఇల్లంగోను ఇళ్లు ఖాళీ చేయమని ఓనర్ ఆర్డర్ వేస్తాడు.
30 రోజులు గడువు ఇస్తాడు. ఈ గడువులోగా ఇల్లంగోకు మరో కొత్త ఇళ్లు దొరికిందా? సినిమా వాళ్లకు ఇళ్లు రెంట్ ఇవ్వడానికి చాలా మంది ఎందుక ఇష్టపడలేదు? ఇండస్ట్రీలో పనిచేసేవారి పట్ల సమాజంలో ఎలాంటి అపోహలు, అభిప్రాయాలు ఉన్నాయన్నది హార్ట్ టచ్చింగ్‌గా డైరెక్టర్ ఈ మూవీలో చూపించాడు.
మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా…
మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ప్రయోగాత్మకంగా చెళియాన్ టూలెట్ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో పాటలు, బీజీఎమ్ ఉండదు. టీవీ, రెడీయోల్లో వచ్చే పాటలు, హారన్ సౌండ్స్‌ను సినిమాలో మ్యూజిక్‌గా వాడుకున్నారు. 2017లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 2019లో రిలీజైంది.
సంబంధిత కథనం