Infinity Movie: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు - తెలుగులో యూట్యూబ్‌లో రిలీజైన మ‌హారాజ యాక్ట‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ-nataraja subramanian crime investigation thriller movies infinity telugu version directly released on youtube kollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Infinity Movie: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు - తెలుగులో యూట్యూబ్‌లో రిలీజైన మ‌హారాజ యాక్ట‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

Infinity Movie: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు - తెలుగులో యూట్యూబ్‌లో రిలీజైన మ‌హారాజ యాక్ట‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

మ‌హారాజ ఫేమ్ న‌ట‌రాజ‌న్ సుబ్ర‌మ‌ణియ‌మ్ హీరోగా న‌టించిన ఇన్ఫినిటీ మూవీ తెలుగులో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీకి సాయికార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇన్ఫినిటీ మూవీ

కోలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ న‌ట‌రాజ‌న్ సుబ్ర‌మ‌ణియ‌మ్ హీరోగా న‌టించి కోలీవుడ్ మూవీ ఇన్ఫినిటీ అదే పేరుతో తెలుగులోకి డ‌బ్ అయ్యింది. ఈ మూవీ నేరుగా యూట్యూబ్‌లో బుధ‌వారం రిలీజైంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సాయి కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

త‌మిళంలో 2023లో రిలీజ్‌...

గ‌త ఏడాది త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఇన్ఫినిటీ మూవీ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.ఈ సినిమా తెలుగులో థియేట‌ర్ల‌లోనే రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఆ నిర్ణ‌యాన్ని మార్చుకున్న మేక‌ర్స్ నేరుగా యూట్యూబ్‌లోనే రిలీజ్ చేశారు. ఇన్ఫినిటీ సినిమాలో న‌ట‌రాజ‌న్ సుబ్ర‌మ‌ణియ‌మ్‌తో పాటు విద్యా ప్ర‌దీప్‌, మునీష్ కాంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాలో సీబీఐ ఆఫీస‌ర్‌గా న‌ట‌రాజ‌న్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విల‌న్‌ను రివీల్ చేసే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు రాసుకున్న ట్విస్ట్‌లు బాగున్నాయంటూ కామెంట్స్ వినిపించాయి.

ఇన్ఫినిటీ క‌థ ఇదే...

సిటీలో ఓ పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు ర‌చ‌యిత‌, ఓ అమ్మాయి అనూమానాస్ప‌ద రీతిలో హ‌త్య‌కు గురువుతారు. సంచ‌ల‌నంగా మారిన ఈ కేసును సీబీఐ ఆఫీస‌ర్ మురుగానంద‌న్ ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. అస‌లైన హంత‌కుడిని ఆ సీబీఐ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడు? ఒక‌రికొక‌రు సంబంధం లేని ముగ్గురు వ్య‌క్తుల‌ను ఆ కిల్ల‌ర్ ఎందుకు చంపేశాడు? ఈ కేసును సాల్వ్ చేయ‌డంలో సీబీఐ ఆఫీస‌ర్‌కు స‌హాయం చేసిన లేడీ డాక్ట‌ర్ ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

త్రివిక్ర‌మ్ సినిమాకు కెమెరామెన్‌...

కెమెరామెన్‌గా తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు ప‌నిచేశాడు న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణియ‌మ్‌. తెలుగులో నితిన్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ అ సినిమాకు న‌ట‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించాడు. త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ క‌లిసి నిర్మించిన ఛ‌ల్ మోహ‌న‌రంగా సినిమాకు కెమెరామెన్‌గా ప‌నిచేశాడు.

హిందీలో ల‌వ్ ఆజ్ క‌ల్‌...

హిందీలో ల‌వ్ ఆజ్ క‌ల్‌, గోల్ మాట్ రిట‌ర్న్స్‌, ప‌రిణీత‌తో పాటు ప‌లు స్టార్ హీరోల సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా న‌ట‌రాజ‌న్ వ్య‌వ‌హ‌రించాడు. 2006లో రిలీజైన నాలై మూవీతో యాక్ట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన న‌ట‌రాజ‌న్ యాభైకిపైగా సినిమాలు చేశాడు. శ‌తురంగ వెట్టై, మిల‌గ‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు. శ‌త‌రురంగ వెట్టై మూవీ తెలుగులో బ్ల‌ఫ్ మాస్ట‌ర్ పేరుతో స‌త్య‌దేవ్ హీరోగా రీమేకైంది. హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌ట‌రాజ‌న్‌ ప‌లు సినిమాలు చేశాడు.రీసెంట్‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన విజ‌య్ సేతుప‌తి మ‌హారాజ మూవీలో న‌ట‌రాజ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు.