శతమానం భవతి దర్శకుడితో ఎన్టీఆర్ బావమరిది కొత్త మూవీ.. తారక్ మెచ్చి సెలెక్ట్ చేసిన కథతో శ్రీ శ్రీ శ్రీ రాజావారు!-narne nithin new movie sri sri sri raja vaaru with director shathamanam bhawathi and jr ntr impressed selected story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  శతమానం భవతి దర్శకుడితో ఎన్టీఆర్ బావమరిది కొత్త మూవీ.. తారక్ మెచ్చి సెలెక్ట్ చేసిన కథతో శ్రీ శ్రీ శ్రీ రాజావారు!

శతమానం భవతి దర్శకుడితో ఎన్టీఆర్ బావమరిది కొత్త మూవీ.. తారక్ మెచ్చి సెలెక్ట్ చేసిన కథతో శ్రీ శ్రీ శ్రీ రాజావారు!

Sanjiv Kumar HT Telugu

జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నార్నే నితిన్ మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో అలరించాడు. ఇప్పుడు శతమానం భవతి మూవీ డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తున్న కొత్త సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు. ఈ సినిమా కథ ఎన్టీఆర్‌ మెచ్చి సెలెక్ట్ చేయడం విశేషం.

శతమానం భవతి దర్శకుడితో ఎన్టీఆర్ బావమరిది కొత్త మూవీ.. తారక్ మెచ్చి సెలెక్ట్ చేసిన కథతో శ్రీ శ్రీ శ్రీ రాజావారు!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. తనకంటూ ఓ పంథాని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు నార్నే నితిన్.

జాతీయ అవార్డ్ విన్నర్

అలాగే జాతీయ అవార్డు విన్నర్ , "శతమానం భవతి" దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సతీష్ వేగేశ్న-నార్నే నితిన్ కాంబినేషన్‌లో తొలిసారిగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోకు జోడీగా సంపద హీరోయిన్‌గా నటిస్తోంది.

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో

ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో జూన్ 6న ప్రేక్షకులకు ముందుకు రానుంది.

బిగ్ హిట్ మూవీని

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, "ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్‌లో ఈ శ్రీ శ్రీ రాజావారు చిత్రాన్ని రూపొందించాం" అని అన్నారు.

వెరైటీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

"మా చిత్ర హీరో నార్నే నితిన్ ఇటీవల మంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌‌తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న" అని ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు తెలిపారు.

మెచ్చి కథను ఎంపిక చేసి

"అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ జూన్ 6న నార్నే నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో మరో సూపర్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం" అని నిర్మాత చింతపల్లి రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీ శ్రీ శ్రీ రాజావారు నటీనటులు

ఇదిలా ఉంటే, శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమాలో నార్నే నితిన్, సంపదతోపాటు రావు రమేష్, వీకే నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీకి కైలాష్ మీనన్ సంగీతం అందించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం