Telugu Bold Movie: ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ యూత్‌ఫుల్ లవ్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
Mayalo OTT: నరేష్ అగస్త్య హీరోగా నటించిన మాయలో మూవీ ఆహా ఓటీటీలో శుక్రవారం రిలీజైంది. బోల్డ్ రొమాంటిక్ మూవీలో భావన, జ్ఞానేశ్వరి కాండ్రేంగుల హీరోయిన్లుగా నటించారు
Mayalo OTT: రిజల్ట్‌తో సంబంధం లేకుండా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోన్నాడు యంగ్ హీరో నరేష్ అగస్త్య. ఇటీవలే పరువు వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నరేష్ అగస్త్య. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌లో సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు.
డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజ్...
మాయలో మూవీలో భావన, జ్ఞానేశ్వర కాండ్రేంగుల హీరోయిన్లుగా నటించారు. మేఘామిత్ర పేర్వార్ దర్శకత్వం వహించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిన్న సినిమా థియేటర్లలొ రిలీజైన మాయలో మూవీ హిట్టుగా నిలవలేకపోయింది.
మూడు పాత్రలతోనే...
రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మాయలో మూవీని డైరెక్టర్ మేఘామిత్రా తెరకెక్కించారు. ఈ కథ మొత్తం ఎక్కువగా మూడు క్యారెక్టర్స్ చుట్టే నడిపించారు డైరెక్టర్. బోల్డ్ డైలాగ్స్ తో యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ ఆడియెన్స్‌ను అలరించే ప్రయత్నం చేశారు.
ముగ్గురు స్నేహితుల కథ...
మాయ (జ్ఞానేశ్వరి)కు పెళ్లి కుదురుతుంది. పెళ్లికి తన చిన్ననాటి స్నేహితులైన శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధు(భావన)లను ఇన్వైట్ చేస్తుంది మాయ. పెళ్లి కోసం ఓ అద్దెకారులో శివ్ కృష్ణ, సింధు బయలుదేరుతారు. ఈ జర్నీలో ఏం జరిగింది? శివ్ కృష్ణ, సింధు మధ్య గొడవలకు కారణం ఏమిటి? మాయ పెళ్లికి సరైన టైమ్‌లో శివ్, సింధు చేరుకున్నారా? మాయ పెళ్లికి వెళ్లకూడదని శివ్ బామ్మ అతడికి ఎందుకు కండీషన్ పెట్టింది? అన్నదే మాయలో మూవీ కథ.
మత్తు వదలరా మూవీతో...
మత్తు వదలరా సినిమతో నరేష్ అగస్త్య సినీ కెరీర్ మొదలైంది. ఇందులో పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. హ్యాపీ బర్త్‌డే, పంచతంత్రం, మెన్ టూ, కిస్మత్‌తో పాటు సేనాపతి సినిమాల్లో హీరోగా నటించాడు. మోడ్రన్ లవ్ హైదరాబాద్, పరువు వెబ్‌సిరీస్‌లలో లీడ్ రోల్స్ చేశాడు. ప్రస్తుతం తెలుగులో నాలుగైదు చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూ నరేష్ అగస్త్య బిజీగా ఉన్నాడు.