TarakRatna Health Bulletin : తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల.. ఏం చెప్పారంటే?
TarakRatna Health Bulletin : నందమూరి తారకరత్న హెల్త్ బులెటిన్ ను నారాయణ హృదయాలయ వైద్యులు విడుదల చేశారు. పరిస్థితి విషమంగానే ఉందని ప్రకటించారు.
నందమూరి తారకరత్న(Tarakaratna) బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొంతున్నారు. తాజాగా వైద్యులు హెల్త్ బులెటిన్(Health Bulletin) విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా డాక్టర్లు ప్రకటించారు. తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందించడం లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ తోపాటుగా ఇతర అత్యాధునిక వైద్య పరికరాలతో చికిత్స చేస్తున్నట్టుగా వెల్లడించారు.
తారకరత్న ఆరోగ్యం గురించి.. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్టుగా నారాయణ హృదయాలయ(Narayana Hrudayalaya) తెలిపింది. నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరుకు ఇప్పటికే వెళ్లారు. చంద్రబాబు(Chandrababu), పురంధేశ్వరి, సుహాసిని తారకరత్న దగ్గరకు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి మీద డాక్టర్లను ఆరా తీశారు. ఆదివారం ఉదయం.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు.
అయితే తారకరత్నకు గుండెపోటుతో పాటుగా మరో వ్యాధి కూడా ఉందని మెున్న ప్రకటించారు. మెలెనా(Melena) అనే అరుదైన వ్యాధి ఉందని తెలిపారు. ఈ కారణంగానే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యపరిస్థితి క్లిష్టంగానే ఉందని తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.
మెలెనా వ్యాధి అంటే..
మెలెనా వ్యాధి జీర్ణశయాంతక రక్తస్రావానికి సంబంధించి ఓ అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే.. వారి మలం జిగటగా, నల్లగ వస్తుంది. అలానే మెలెనాతో అన్నవాహిక నోరు, పొట్ట, చిన్నపేగు మెుదటి భాగం రక్తస్రావానికి గురి అవుతూ ఉంటుంది. అయితే కొన్ని కేసుల్లో మాత్రం ఎక్కువ జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు భాగంలో కూడా రక్తస్రావం జరిగే ఛాన్స్ ఉంది. పెప్టిక్ అల్సర్స్ ట్రీట్మెంట్, ఎండోస్కోపీ థెరపీ వంటి చికిత్సలను చేస్తారని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే యాంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలతో పాటు రక్తాన్ని మార్పిడి చేయాలి.
కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మెుదట కుప్పంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్న త్వరగా కోలుకోవాని.. అందరూ కోరుకుంటున్నారు.