Narakasura OTT: ఓటీటీలోకి వచ్చేసిన పలాస హీరో సినిమా నరకాసుర.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..-narakasura movie ott streaming started on amazon prime video on rental basis ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Narakasura Ott: ఓటీటీలోకి వచ్చేసిన పలాస హీరో సినిమా నరకాసుర.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Narakasura OTT: ఓటీటీలోకి వచ్చేసిన పలాస హీరో సినిమా నరకాసుర.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 10, 2024 05:42 PM IST

Narakasura OTT Streaming: నరకాసుర సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ వివరాలివే..

Narakasura OTT: ఓటీటీలోకి వచ్చేసిన పలాస హీరో సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..
Narakasura OTT: ఓటీటీలోకి వచ్చేసిన పలాస హీరో సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Narakasura OTT Streaming: ‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం గతేడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ నావో అకోస్టా దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ప్రమోషన్లు కూడా పెద్దగా జరగకపోవటంతో ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. కాగా, ఇప్పుడు ఈ నరకాసుర మూవీ ఓటీటీలోకి సడెన్‍గా వచ్చేసింది. అయితే, ఓ ట్విస్టుతో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

నరకాసుర సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హఠాత్తుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ముందస్తుగా ప్రచారం లేకుండా సడెన్‍గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ సినిమా రెంటల్ బేసిస్‍లో స్ట్రీమింగ్‍కు రావడం ట్విస్టుగా ఉంది.

రెంటల్ పద్ధతిలో..

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నరకాసుర చిత్రం రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అంటే ప్రైమ్ వీడియో సబ్‍‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లు కూడా ఈ చిత్రాన్ని చూడాలంటే ప్రస్తుతం రూ.79 రెంట్ చెల్లించాలి. పెద్దపెద్ద సినిమాలే సాధారణంగా స్ట్రీమింగ్‍కు వస్తుంటే.. నరకాసుర మాత్రం రెంటల్ విధానంలో అడుగుపెట్టింది. అయితే, కొద్ది రోజుల తర్వాత ఈ చిత్రం అందరికీ ఉచితంగా రెంటల్ లేకుండా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నరకాసుర చిత్రంలో రక్షిత్ అట్లూరి హీరోగా చేయగా.. అపర్ణా జనార్దన్, సంగీతా విపిన్, శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమన్, తేజ్ చరణ్‍రాజ్ కీలకపాత్రలు పోషించారు. సెబాస్టియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాఫర్ రాజా సంగీతం అందించారు. అజ్జా శ్రీనివాస్, కురుమారు రఘు ఈ చిత్రాన్ని నిర్మించారు.

నరకాసుర స్టోరీ లైన్ ఇదే

నరకాసుర సినిమా యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చింది. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామంలో శివ (రక్షిత్ అట్లూరి) నివసిస్తుంటాడు. కాఫీ, మిరపను తరలించే లారీ డ్రైవర్‌గా అతడు పని చేస్తుంటాడు. అక్కడి ఎమ్మెల్యే నాగమ నాయుడు (చరణ్ తేజ)కు విధేయుడిగా శివ ఉంటాడు. ఎమ్మెల్యే చెప్పిన పనులు చేస్తుంటాడు. గొడవలకు దిగేందుకు కూడా వెనుకాడడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమారుడు ఆది నాయుడు (తేజ చరణ్ రేజ్)తో శివకు గొడవ అవుతుంది. ఆ తర్వాత సడెన్‍గా శివ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? శివ ఏమయ్యాడు? శివ, ఆది మధ్య గొడవకు కారణమేంటి? మళ్లీ శివ తిరిగొచ్చాడా? ట్రాన్స్‌జెండర్లకు ఈ కథతో సంబంధం ఏంటి? అనేదే నరకాసుర మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

నరకాసుర సినిమాకు మిక్స్ట్ టాకే వచ్చింది. ముఖ్యంగా కథనం సరిగాలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లను దక్కించుకోలేకపోయింది.

కాగా, మార్చి 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లోకి రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా వచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్‍ ఓటీటీలోనూ ఈగల్ స్ట్రీమింగ్‍కు వచ్చింది.