Nani on Malayalam Movies: నానికి నచ్చిన మలయాళం మూవీస్ ఇవేనట.. ఆ ఫహాద్ ఫాజిల్ సినిమా వల్లే మాలీవుడ్‌పై మనసు పారేసుకొని..-nani watched malayalam movies trance manjummel boys bangalore days bheeshma parvam kannur squad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani On Malayalam Movies: నానికి నచ్చిన మలయాళం మూవీస్ ఇవేనట.. ఆ ఫహాద్ ఫాజిల్ సినిమా వల్లే మాలీవుడ్‌పై మనసు పారేసుకొని..

Nani on Malayalam Movies: నానికి నచ్చిన మలయాళం మూవీస్ ఇవేనట.. ఆ ఫహాద్ ఫాజిల్ సినిమా వల్లే మాలీవుడ్‌పై మనసు పారేసుకొని..

Hari Prasad S HT Telugu

Nani on Malayalam Movies: నాని కూడా మలయాళం సినిమాలపై మనసు పారేసుకున్నాడు. కొవిడ్ సమయంలో వరుసబెట్టి ఆ ఇండస్ట్రీ సినిమాలు చూశాడట. తనకు బాగా నచ్చిన సినిమాలేవో కూడా అతడు వెల్లడించాడు. మరి మీరు ఆ మూవీస్ చూశారో లేదో చూడండి.

నానికి నచ్చిన మలయాళం మూవీస్ ఇవేనట.. ఆ ఫహాద్ ఫాజిల్ సినిమా వల్లే మాలీవుడ్‌పై మనసు పారేసుకొని..

Nani on Malayalam Movies: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సాధారణ తెలుగు ప్రేక్షుకుల్లాగే మలయాళం సినిమాలకు ఫిదా అయిపోయాడట. తన నెక్ట్స్ మూవీ హిట్ 3 ప్రమోషన్లలో భాగంగా అతడు మలయాళం మూవీస్ గురించి మాట్లాడాడు. ఆ సినిమాలు చూడటానికి కారణమేంటన్నదానితోపాటు ఫేవరెట్ సినిమాల గురించి కూడా వెల్లడించాడు.

ఆ ఫహాద్ ఫాజిల్ మూవీ చూసిన తర్వాతే..

మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ట్రాన్స్ మూవీ చూసిన తర్వాతే తాను ఆ ఇండస్ట్రీ సినిమాల పట్ల ఆకర్షితుడైనట్లు నాని వెల్లడించాడు. ఈ మూవీ 2020లో రిలీజైంది. ఆ మూవీ చూసిన తర్వాత తన దిమ్మదిరిగిపోయినట్లు నాని చెప్పాడు. దీంతో ఆ ఏడాది కొవిడ్ సమయంలో వరుసబెట్టి మలయాళం సినిమాలన్నీ తాను చూసినట్లు నాని చెప్పాడు.

ఇక తనకు నచ్చిన మలయాళం సినిమాల గురించి కూడా అతడు వెల్లడించాడు. ఫహాద్ ఫాజిలే నటించిన కుంబలంగి నైట్స్, ఆవేశం, దుల్కర్ సల్మాన్ నటించిన బెంగళూరు డేస్, మంజుమ్మెల్ బాయ్స్, మమ్ముట్టి నటించిన భీష్మ పర్వం, కన్నూర్ స్క్వాడ్, మోహన్ లాల్ నటించిన లూసిఫర్ లాంటి సినిమాలు తనకు బాగా నచ్చాయని నాని చెప్పాడు.

ట్రాన్స్ మూవీ గురించి..

ట్రాన్స్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను అన్వర్ రషీద్ డైరెక్ట్ చేశాడు. విన్సెంట్ వడక్కన్ కథ అందించాడు. ఓ నాస్తికుడిని క్రిస్టియన్ పాస్టర్ గా మార్చేసి.. అతని ద్వారా కోట్లు గడించే ఓ నకిలీ ఏజెన్సీ చుట్టూ ఈ ట్రాన్స్ మూవీ కథ తిరుగుతుంది. చిటికెలో రోగాలను మాయం చేసే పాస్టర్లను నమ్మి సాధారణ జనం ఎలా మోసపోతారన్నది ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

అలాంటి పాస్టర్లను జనాలపైకి వదిలే కార్పొరేట్ల బాగోతాన్ని కూడా మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. అసలు దేవుడినే నమ్మని ఓ వ్యక్తి ఆ దేవుడినే అడ్డం పెట్టుకొని కేవలం తన మాటల ద్వారా ప్రపంచమే మెచ్చే ఓ పెద్ద పాస్టర్ గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూడొచ్చు.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ తన నట విశ్వరూపం చూపించాడు. ఓ సున్నితమైన అంశాన్ని కథగా తీసుకొని అన్వర్ రషీద్ ఈ మూవీని తెరకెక్కించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమాను యూట్యూబ్ లో తెలుగులోనూ చూడొచ్చు. ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.

ఇక నాని నటించిన హిట్ 3 మూవీ మే 1న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ గా నటించింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం