Dasara 3rd Single: దసరా నుంచి మూడో పాటకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?-nani starred dasara 3rd single out on 8th march ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Starred Dasara 3rd Single Out On 8th March

Dasara 3rd Single: దసరా నుంచి మూడో పాటకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Maragani Govardhan HT Telugu
Mar 03, 2023 08:20 PM IST

Dasara 3rd Single: నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా నుంచి మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ పాటను మార్చి 30న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

దసరా నుంచి మూడో పాట
దసరా నుంచి మూడో పాట

Dasara 3rd Single: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దోస్తాన్, వారి సాంగ్ విడుదలై శ్రోతలను అలరించాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రానుంది. దసరా నుంచి థర్డ్ సింగిల్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. నాని, కీర్తి సురేష్‌పై ఈ పాటను చిత్రీకరించారు.

ఫోక్ మెలోడీగా ఈ పాట రానుంది. చంకీలా అంగీలేసి అంటూ ఈ పాట సాగుతుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో ఈ పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. మార్చి 8న దసరా థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫోక్ మెలోడీగా సాగనున్న ఈ పాటలో నాని, కీర్తి సురేష్ మధ్య రస్టిక్ రొమాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ పోస్టర్‌లో నాని కలర్ ఫుల్ షర్ట్‌ ధరించి స్కూటర్ నడుపుతుండగా.. కీర్తి సురేష్ వెనక సీట్లో కూర్చుంది. ఇద్దరి ముఖాల్లో ఆహ్లాదకరమైన చిరునవ్వు ఉంది. పల్లేటూరి పాత్రలకు అనుగుణంగా వీరిద్దరి లుక్స్ ఉన్నాయి. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

IPL_Entry_Point