The Paradise OTT: నాని సినిమా ఓటీటీ హక్కులకు భారీ రేటు.. షూటింగ్ మొదలుకాకుండానే డీల్ క్లోజ్!-nani srikanth odela movie the paradise ott digital rights sold for whooping price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Paradise Ott: నాని సినిమా ఓటీటీ హక్కులకు భారీ రేటు.. షూటింగ్ మొదలుకాకుండానే డీల్ క్లోజ్!

The Paradise OTT: నాని సినిమా ఓటీటీ హక్కులకు భారీ రేటు.. షూటింగ్ మొదలుకాకుండానే డీల్ క్లోజ్!

The Paradise OTT: ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అప్పుడే అమ్ముడైనట్టు సమాచారం బయటికి వచ్చింది. షూటింగ్ కూడా మొదలుకాకుండానే డీల్ జరిగిపోయిందట. భారీ ధర వచ్చినట్టు సమాచారం.

The Paradise OTT: నాని సినిమా ఓటీటీ హక్కులకు భారీ రేటు.. షూటింగ్ మొదలుకాకుండానే డీల్ క్లోజ్

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‍లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై హైప్ ఎక్కువగా ఉంది. ఇటీవల వచ్చిన ఒక్క గ్లింప్స్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ మూవీ ఎంత రస్టిక్‍గా, వైలెంట్‍గా ఉండనుందో గ్లింప్స్‌తో అర్థమైపోయింది. అందులోనూ గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న ది ప్యారడైజ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అప్పుడే అమ్ముడయ్యాయనే సమాచారం బయటికి వచ్చింది.

స్ట్రీమింగ్ హక్కుల ధర ఇదే

ది ప్యారడైజ్ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దాదాపు రూ.65కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం వెల్లడైంది. అయితే, ఏ ఓటీటీ తీసుకుందనేది స్పష్టంగా సమాచారం బయటికి రాలేదు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీనే తీసుకుందని తెలుస్తోంది. అలాగే, ఈ చిత్రం ఆడియో హక్కులు రూ.18కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.

షూటింగ్ షురూ కాకుండానే..

ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఇంకా మొదలే కాలేదు. ఇటీవలే గ్లింప్స్ మాత్రమే వచ్చింది. అదే చాలా డిఫరెంట్‍గా, ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఫుల్ బజ్ నెలకొంది. ఈ మూవీలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‍లోనూ రిలీజ్ చేసేలా మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. స్పానిష్‍లోనూ గ్లింప్స్ వచ్చింది. ఈ రేంజ్‍లో అంచనాలు ఉండటంతో ది ప్యారడైజ్ షూటింగ్ ప్రారంభానికి ముందే స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడయ్యాయి. ఏకంగా స్ట్రీమింగ్ హక్కులకే రూ.65 కోట్లు మేకర్లకు దక్కాయి.

నాని - శ్రీకాంత్ కాంబినేషన్‍లో వచ్చిన దసరా సూపర్ హిట్ కొట్టింది. తొలి చిత్రంతోనే శ్రీకాంత్‍కు భారీ బ్లాక్‍బస్టర్ దక్కింది. రెండో మూవీ కూడా నానితోనే చేస్తున్నారు శ్రీకాంత్. ది ప్యారడైజ్ మూవీ బడ్జెట్ రూ.100కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ చిత్రాన్ని ఎస్‍ఎల్‍వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ది ప్యారడైజ్ మూవీలో నాని డిఫరెంట్ గెటప్‍లో కనిపించనున్నారు. పొడవైన జడలు, కండలు తిరిగిన దేహంతో ఇంటెన్స్ రస్టిక్ లుక్‍తో గ్లింప్స్‌లో నాని అదరగొట్టారు. పవర్‌ఫుల్ డైలాగ్‍తో ఈ గ్లింప్స్ అదిరిపోయింది. కడుపులు మండిన కాకుల కథ అంటూ వచ్చిన గ్లింప్స్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. మే 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ వైలెంట్‍గా ఉంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం