Nani on Hi Nanna: హాయ్ నాన్న మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది: నాని
Nani on Hi Nanna: హాయ్ నాన్న మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుందని అన్నాడు నేచురల్ స్టార్ నాని. బుధవారం (సెప్టెంబర్ 13) ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ నాని ఈ మూవీ మ్యూజిక్ గురించి చెప్పాడు.

Nani on Hi Nanna: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ హాయ్ నాన్న. దసరాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత నాని ఈ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దసరా సినిమాలో ఊర మాస్ అవతార్ లో కనిపించిన అతడు.. ఇప్పుడు మరోసారి పక్కింటి కుర్రాడి క్యారెక్టర్ లో ఒదిగిపోవడానికి రెడీ అవుతున్నాడు.
అయితే బుధవారం (సెప్టెంబర్ 13) హాయ్ నాన్న మ్యూజిక్ కు సంబంధించి నాని చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుందంటూ అతడు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా కనిపించిన మృనాల్ ఠాకూర్ కూడా ఈ వీడియోలో ఉంది.
"ఈ ఆల్బమ్ మిమ్మల్ని కదిలించి వేస్తుంది. ప్రస్తుతానికి ఓ పాటతో ప్రారంభిద్దాం" అనే క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ చేశాడు నాని. అందులో నాని, మృనాల్ కళ్లతోనే మాట్లాడుకోవడం చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ లో సముద్ర అలల హోరు వినిపిస్తుంటే.. ఈ ఇద్దరూ కనులతోనే సైగలు చేసుకుంటూ ఉంటారు. అంతలోనే త్వరలోనే మ్యాజిక్ ప్రారంభం అవుతుందంటూ స్క్రీన్ పై కనిపిస్తుంది.
శౌర్యవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఖుషీ మూవీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ హాయ్ నాన్న మూవీకి కూడా మ్యూజిక్ అందించాడు. ఖుషీ సినిమా మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. దీంతో హాయ్ నాన్న మూవీ మ్యూజిక్ పై ఆసక్తి పెరుగుతోంది. దీనికితోడు ఈ పోస్ట్ తో నాని ఆ ఆసక్తిని మరింత పెంచాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రానున్నట్లు నాని హింట్ ఇచ్చాడు.
అయితే అది ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఈ హాయ్ నాన్న సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల కలిసి వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. ఇందులో శృతి హాసన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.