Saripodhaa Sanivaaram OTT: నాని వంద కోట్ల మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - రిలీజ్ డేట్ ఫిక్స్ - ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్-nani saripodhaa sanivaaram to stream on netflix ott from september 26th available in five languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Ott: నాని వంద కోట్ల మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - రిలీజ్ డేట్ ఫిక్స్ - ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్

Saripodhaa Sanivaaram OTT: నాని వంద కోట్ల మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - రిలీజ్ డేట్ ఫిక్స్ - ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్

Nelki Naresh Kumar HT Telugu
Sep 21, 2024 12:11 PM IST

Saripodhaa Sanivaaram OTT: నాని లేటెస్ట్ సూప‌ర్ హిట్ మూవీ స‌రిపోదా శ‌నివారం ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ఫిక్సైంది. సెప్టెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఐదు భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల‌కానుంది. స‌రిపోదా శ‌నివారం మూవీకి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

స‌రిపోదా శ‌నివారం ఓటీటీ
స‌రిపోదా శ‌నివారం ఓటీటీ

Saripodhaa Sanivaaram OTT: నాని స‌రిపోదా శ‌నివారం ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ఫిక్స‌యింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ సెప్టెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. రిలీజ్ డేట్‌తో పాటు మూవీ కొత్త పోస్ట‌ర్‌ను నెట్‌ఫ్లిక్స్ అభిమానుల‌తో పంచుకున్న‌ది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌...

స‌రిపోదా శ‌నివారం మూవీకి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త సినిమాల‌కు భిన్నంగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించిన ఈ మూవీ వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 40 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాత‌ల‌కు ప‌ది కోట్ల‌కుపైగా లాభాల‌ను తెచ్చిపెట్టింది.

ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో..

ఆగ‌స్ట్ 29న రిలీజైన స‌రిపోదా శ‌నివారం ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ఆడుతోంది. సెప్టెంబ‌ర్ 20న(శుక్ర‌వారం) 30 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. థియేట‌ర్ల‌లో ఆడుతోండ‌గానే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎస్‌జే సూర్య విల‌న్‌...

స‌రిపోదా శ‌నివారం సినిమాలో ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఎస్‌జే సూర్య విల‌న్‌గా క‌నిపించాడు. నానికి ధీటుగా ఎస్‌జే సూర్య త‌న విల‌నిజంతో ఆడియెన్స్‌ను మెప్పించాడు. కొన్ని సీన్స్‌లో నానిని డామినేట్ చేశాడు. స‌రిపోదా శ‌నివారం మూవీలో అభిరామి, అదితి బాల‌న్‌, సాయికుమార్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దాన‌య్య ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.

స‌రిపోదా శ‌నివారం క‌థ ఇదే..

సూర్య‌కు (నాని) కోపం ఎక్కువ‌. అయితే త‌న‌ కోపాన్ని శ‌నివారం మాత్ర‌మే చూపిస్తాన‌ని త‌ల్లికి మాటిస్తాడు సూర్య‌. తాను కొట్టాల‌నుకుంటున్న వారి పేర్ల‌ను డైరీలో రాసుకుంటాడు. సోకులపాలెం సీఐ ద‌యానంద్‌ (ఎస్‌జే సూర్య‌) శాడిస్ట్ పోలీస్ ఆఫీస‌ర్‌. అన్న‌య్య కూర్మాచ‌లం (మురళీశర్మ) కార‌ణంగా ద‌యానంద్‌కు రావాల్సిన కోట్ల ఆస్తి చేజారిపోతుంది. అన్న‌పై ఉన్న‌కోపాన్ని సోకుల‌పాలెం ప్ర‌జ‌ల‌పై చూపిస్తుంటాడు ద‌యానంద్‌.అడ్డొచ్చిన వారిని చిత‌క్కొడుతుంటాడు.

సోకుల ఊరి ప్ర‌జ‌ల‌ను ద‌యానంద్ బారి నుంచి కాపాడాల‌ని సూర్య ఫిక్స‌వుతాడు. సూర్య పోరాటంలో అత‌డికి అండ‌గా నిలిచిన చారుల‌వ ఎవ‌రు? సూర్య ప్లాన్స్ ద‌యానంద్‌కు తెలిసిపోయాయా? ద‌యానంద్‌కు సూర్య బుద్ది చెప్పాడా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

అంటే సుంద‌రానికి త‌ర్వాత‌...

స‌రిపోదా శ‌నివారం కంటే ముందే నాని, డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో అంటే సుంద‌రానికి మూవీ వ‌చ్చింది. అంటే సుంద‌రానికి క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. నాని, ప్రియాంక మోహ‌న్ క‌ల‌యిక‌లో గ‌తంలో గ్యాంగ్‌లీడ‌ర్ మూవీ వ‌చ్చింది.

మూడు సినిమాలు...

స‌రిపోదా శ‌నివారం త‌ర్వాత మూడు సినిమాల‌కు నాని గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌నుతో హిట్ 3 మూవీ చేయ‌నున్నాడు నాని. వ‌చ్చే ఏడాది మే 1న ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ద‌స‌రా త‌ర్వాత నాని, డైరెక్ట‌ర్ శ్రీకాంత ఓదెల కాంబోలో ఓ మూవీ రానుంది.

టాపిక్