Saripodhaa Sanivaaram Twitter Review: సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ - నాని మాస్ బొమ్మ అదుర్స్ -గూస్‌బంప్స్ పక్కా
Saripodhaa Sanivaaram Twitter Review: అంటే సుందరానికి తర్వాత నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజైంది.ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. సరిపోదా శనివారం టాక్ ఎలా ఉందంటే?
Saripodhaa Sanivaaram Twitter Review: ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సరిపోదా శనివారం ఒకటి. నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్వకత్వం వహించాడు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటించాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియన్స్ టాక్ ఎలా ఉంది? నానికి వివేక్ ఆత్రేయ హిట్టిచ్చాడా? లేదా? అంటే?
మాస్ యాక్షన్ డ్రామా...
నానితో పాటు వివేక్ ఆత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్ ఎమోషన్స్, కామెడీ కలబోతగా సాఫ్ట్‌గా ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మాస్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తోన్నారు. నాని, ఎస్‌జే సూర్య కలిసి స్క్రీన్‌పై కనిపించే ప్రతి సీస్ అదిరిపోతుందని అంటున్నారు.
హీరో ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని చెబుతోన్నారు. రేసీ స్క్రీన్‌ప్లే, హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్‌ను పంచుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
మాస్ రోల్‌లో కుమ్మేశాడు...
సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్, మాస్ రోల్‌లో కుమ్మేశాడని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతార్‌లో నాని కనిపిస్తాడని అన్నాడు. నానికి ధీటుగా ఎస్‌జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య చెలరేగిపోయాడని చెబుతోన్నారు.
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు…
తన టిఫికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిక్ స్టోరీలైన్‌తో దర్శకుడు వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు. హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్, కొన్ని ట్విస్ట్‌లు మాత్రం సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని ట్వీట్లు చేస్తున్నారు. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారని ట్వీట్స్ చేస్తున్నారు. సెకండాఫ్‌ను మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్స్‌గా నడిపించాడని ఓ నెటిజన్ అన్నాడు.
మూడు గంటల రన్ టమ్...
మూడు గంటల రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెబుతోన్నారు. ఫస్ట్ హాఫ్‌లో నాని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగతీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. హీరో పాత్రను పరిచయం చేయడానికి డైరెక్టర్ ఎక్కువగా టైమ్ తీసుకున్నాడని అంటున్నారు.
కథ , ట్విస్ట్‌లు చాలా వరకు ప్రెడిక్టబుల్‌గా సాగుతుందని చెబుతోన్నారు. జేక్స్ బిజోయ్ బీజీఎమ్ సినిమా హైలైట్‌గా నిలిచిందని ఓవర్‌సీస్ ఆడియెన్స్ పేర్కొన్నారు. ఓవరాల్‌గా సరిపోదా శనివారం టైమ్‌పాస్ యాక్షన్ మూవీ అని, నాని, ఎస్‌జే సూర్య యాక్టింగ్ కోసం చూడొచ్చని అంటున్నారు.