Nani on Telangana Elections: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సినిమా భాషలో స్పందించిన నాని.. ఆన్సర్ అదుర్స్ అంటున్న నెటిజన్లు
Nani on Telangana Elections: సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన చాలా ప్రశ్నలకు హీరో నాని సమాధానాలు ఇచ్చారు. అలాగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Nani on Telangana Elections: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్లను మూవీ యూనిట్ జోరుగా చేస్తోంది. హీరో నాని చాలా ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కాగా, #AskNani హ్యాష్‍ట్యాగ్‍తో ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్)లో ప్రశ్నలు అడిగితే.. సమాధానాలు ఇస్తానని నేడు నాని పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది ప్రశ్నలు అడిగారు. చాలా క్వశ్చన్లకు నాని ఆన్సర్లు ఇచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం (డిసెంబర్ 3) వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దక్కించుకొని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. హీరో నానిని ఈ విషయంపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. “తెలంగాణలో ఓటు వేశారుగా.. తెలంగాణ రిజల్ట్స్ గురించి మీ మాటలో?” అని నాని ఓ యూజర్ అడిగారు. దీనికి నాని రిప్లై ఇచ్చారు.
“10 ఏళ్లు బ్లాక్‍బాస్టర్ సినిమా చూశాం. థియేటర్ల సినిమా మారింది. ఇది కూడా బ్లాక్‍బాస్టర్ అవ్వాలని కోరుకుందాం” అని నాని సమాధానం ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అద్భుతంగా సాగిందని, కాంగ్రెస్ పాలన కూడా అలాగే ఉంటుందని ఆశిద్దామనేలా.. సినిమా భాషలో బ్లాక్‍బాస్టర్ అంటూ నాని స్పందించారు.
తెలంగాణ ఎన్నికలపై నాని స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఓ సెలెబ్రిటీగా ఈ ప్రశ్నకు ఇంతకంటే బెస్ట్ ఆన్సర్ ఎవరూ ఇవ్వలేరంటూ కొందరు స్పందిస్తున్నారు. దీన్నే మెచ్యూరిటీ అంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆన్సర్ అదుర్స్ అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు.
నాని నేడు తిరుమలకు వెళ్లారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దీంతో దర్శనం గురించి చెప్పాలని ఓ యూజర్ అడిగారు. “దర్శనం బాగా జరిగింది. వర్షంలో కాలినడకన వెళ్లాను. తడిసిపోయింది” అని నాని సమాధానం ఇచ్చారు.
హాయ్ నాన్న సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా నటించారు. హాయ్ నాన్న సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించగా.. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం