Nani on Jai Bhim: జై భీమ్ మూవీపై నాని మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..-nani on jai bhim says his tweet had been taken out of context ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani On Jai Bhim: జై భీమ్ మూవీపై నాని మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..

Nani on Jai Bhim: జై భీమ్ మూవీపై నాని మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..

Hari Prasad S HT Telugu

Nani on Jai Bhim: జై భీమ్ మూవీపై నాని మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రాని సందర్భంలో తాను చేసిన ట్వీట్ ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పడం గమనార్హం.

టాలీవుడ్ నటుడు నాని (ఫైల్ ఫొటో)

Nani on Jai Bhim: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని మరోసారి సూర్య నటించిన జై భీమ్ మూవీపై స్పందించాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రాకపోవడంపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన అతడు.. ఈ విషయంలో అందరూ తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు. ఇండియా టుడే తెలంగాణ రౌండ్ టేబుల్లో నాని మాట్లాడాడు.

ఈ సందర్భంగా తెలుగు సినిమాకు గతంలో ఎప్పుడూ లేనన్ని నేషనల్ అవార్డులు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, అయితే అదే సమయంలో తనకు బాగా నచ్చిన జై భీమ్ సినిమాకు ఒక్క అవార్డు కూడా ఇవ్వకపోవడం బాధ కలిగించిందని నాని అన్నాడు. ఆ సమయంలో తాను చేసిన తొలి ట్వీట్ ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపాడు.

అసలు జై భీమ్ మూవీ చూశారా?: నాని

ఈ సందర్భంగా మరోసారి జై భీమ్ మూవీపై నాని ప్రశంసలు కురిపించాడు. నేషనల్ అవార్డులు ఇచ్చే వాళ్లు అసలు ఈ సినిమా చూశారా అని తనకు అనిపించినట్లు నాని చెప్పాడు. తొలిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు తెలుగు వాడైన అల్లు అర్జున్ కు రావడం.. ఆర్ఆర్ఆర్, పుష్పలాంటి సినిమాలు అవార్డులు అందుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చినట్లు కూడా నాని చెప్పాడు.

"నా ఇంట్లో చెల్లెలు, పక్కింట్లో కజిన్ ఎగ్జామ్స్ రాసారనుకోండి. నా చెల్లెలు పాసైంది. కజిన్ ఫెయిలయ్యారు. అప్పుడు చెల్లెలు పాసైనందుకు సంతోషంగా ఉంటా. అదే సమయంలో కజిన్ కోసం బాధపడతా. జై భీమ్ విషయంలో నా స్పందన కూడా అలాంటిదే" అని నాని వివరణ ఇచ్చాడు. జై భీమ్ మూవీ నేషనల్ అవార్డుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న సినిమా అని, కానీ ఒక్క కేటగిరీలోనూ అవార్డు రాకపోవడం తనకు బాధ కలిగించిందని నాని చెప్పాడు.

జై భీమ్ మూవీలో సూర్య నటించాడు. అతడే మూవీని నిర్మించాడు కూడా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మద్రాస్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా దర్శకుడు జ్ఞానవేళ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.