నాని హిట్ 3 మూవీ ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. యాభై కోట్ల టార్గెట్‌తో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మంగళవారం నాటితో లాభాల్లోకి అడుగుపెట్టింది. ఏడాది అతి తక్కువ టైమ్‌లో బ్రేక్ ఈవెన్‌ను సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఆరు రోజుల్లో ఈ మూవీ 110 కోట్లకుపైగా గ్రాస్, 58 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. హిట్ 3 మూవీ 49 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. యాభై కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కేవలం ఆరు రోజుల్లోనే యాభై కోట్ల మైలురాయిని టచ్ చేసింది. మంగళవారం రోజు ఈ మూవీ రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షలకుపైనే వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
హిట్ 3 మూవీతో వరుసగా నాలుగో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నాని. హిట్ 3 కంటే ముందు నాని నటించిన దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ వారం పెద్ద సినిమాలేవి పోటీలో లేకపోవడం హిట్ 3కి కలిసివచ్చే అవకాశం కనిపిస్తోంది. వంద కోట్ల షేర్ మార్కును ఈ మూవీ టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఓవర్‌సీస్‌లో ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఒక్క నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ల మార్కును దాటేసినట్లు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
హిట్ 3 మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో ప్రతీక్ బబ్బర్, సముద్రఖని, రావురమేష్ కీలక పాత్రల్లో నటించారు. అడివి శేష్, కార్తీ అతిథి పాత్రల్లో మెరిశారు.
అర్జున్ సర్కార్ (నాని) ఎస్‌పీగా ఏపీకి ట్రాన్స్‌ఫర్ మీద వస్తాడు. బదిలీపై వస్తాడు. సొసైటీలో క్రిమినల్ అనే వాడు కనిపించకూడదు అన్నది అతడి సిద్ధాంతం.సిన్సియర్ పోలీస్ అయిన అర్జున్ సర్కార్...కొన్ని హత్యలు చేస్తూ వర్ష అనే ఆఫీసర్‌కు దొరకిపోతాడు. అసలు అర్జున్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? దేశంలో జరుగుతోన్న సీరియల్ కిల్లింగ్స్‌కు సీటీకే అనే డార్క్ వెబ్‌సైట్‌కు ఉన్న సంబంధమేమిటి?
సీటీకే ఆగడాలను అర్జున్ అడ్డుకున్నాడా? మృదులతో అర్జున్ ప్రేమాయణం సాఫీగా సాగిందా? అన్నదే ఈ మూవీ కథ.
హిట్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్‌గా హిట్ 3 తెరకెక్కింది. హిట్ 4లో కార్తీక్ హీరోగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం