ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు రేకెత్తించిన సినిమాల్లో హిట్ 3 ఒకటి. నాని హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నాని సినిమాలంటే సాఫ్ట్, సెన్సిటివ్ స్టోరీస్ గుర్తొస్తాయి. వాటికి పూర్తి భిన్నంగా మోస్ట్ వయలెంట్ మూవీగా హిట్ 3 రూపొందింది. ఈ మూవీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
హిట్ 3 వయలెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని ఓవర్‌సీస్ ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తోన్నారు. స్క్రీన్‌పై రక్తం ఏరులైపారుతుందని చెబుతోన్నారు. నాని ప్రమోషన్స్‌లో చెప్పినట్లు పిల్లలు, ఫ్యామిలీస్ సినిమాలోని రక్తపాతం, హింసను తట్టుకోవడం కష్టమేనని అంటున్నారు. బోల్డ్ డైలాగ్స్ కూడా సినిమాలో ఎక్కువేనట.
యాక్షన్ ఎపిసోడ్స్‌తో డైరెక్టర్ ఇరగదీశాడని, ఒక్కో ఫైట్ సీక్వెన్స్ ఒక్కో క్లైమాక్స్‌లా ఉంటుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుందని, స్క్రీన్‌ప్లే కూడా ప్రెడిక్టబుల్‌గా ఉంటుందని చెబుతోన్నారు. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం థ్రిల్లింగ్‌ను పంచుతుందని, సెకండాఫ్ నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠను కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులకు ఓ హై మూవ్‌మెంట్ ఇస్తుందని అంటున్నారు. హిట్ 3 రా అండ్ రస్టిక్ మూవీ అని కామెంట్స్ చేస్తున్నారు.
హిట్ 3 సెకండాఫ్‌లో వచ్చే చాలా సీన్స్ కొరియన్ సిరీస్ స్క్విడ్ గేమ్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించినట్లుగా ఉన్నాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ట్విస్ట్‌ల కంటే మాస్ మూవ్‌మెంట్స్, నాని హీరోయిజాన్ని నమ్ముకొనే హిట్ 3ని శైలేష్ కొలను తెరకెక్కించాడని చెబుతోన్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని అంటున్నారు. అతిథి పాత్రలు సర్‌ప్రైజ్ చేస్తాయట.
అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొట్టాడని, యాక్షన్ రోల్ నాని నటన, అతడి డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ కొత్తగా ఉన్నాయని చెబుతోన్నారు. నాని, శ్రీనిధి శెట్టి కెమిస్ట్రీ, వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. వాల్యూస్, సినిమాటోగ్రఫీ బాగున్నాయని అంటున్నారు.
మ్యూజిక్ మాత్రం బిగ్గెస్ట్ మైనస్‌గా మారిందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తోన్నారు. సినిమాపై ఉన్న అంచనాలకు పూర్తిగా రీచ్ కాలేకపోయినా నాని యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ మూవ్‌మెంట్స్ కోసం హిట్ 3ని చూడొచ్చు ఆడియెన్స్ ట్వీట్లు చేస్తోన్నారు.
సంబంధిత కథనం
టాపిక్