కన్నడ బ్యూటిపుల్ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ 1, 2 సినిమాలతో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఒకటిరెండు సినిమాల్లో నటించి అలరించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇవ్వనుంది శ్రీనిధి శెట్టి.
నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మే 1న థియేటర్లలో విడుదల కానున్న హిట్ ది థర్ట్ కేస్ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ నేపథ్యంలో హిట్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా కేజీఎఫ్ 3లో నటించడం, రామాయణంలో సీత క్యారెక్టర్‌ను రెజెక్ట్ చేయడం వంటి ఇతర సినీ విశేషాలను పంచుకుంది శ్రీనిధి శెట్టి.
-నాని గారి సినిమాలన్నీ చూశాను. నేచురల్ పర్ఫార్మర్. ఆయన చాలా గ్రౌండెడ్‌గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం వెరీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. చాలా కంఫర్ట్ ఇచ్చారు. అలాంటి కంఫర్ట్ జోన్ ఇస్తే పర్ఫామెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
-నేను కథవిన్నప్పుడే చాలా వయోలెన్స్ యాక్షన్ ఉందనిపించింది. నిజానికి ఈ స్టోరీకి అలాంటి వయోలెన్స్ యాక్షన్ కావాలి. ఈ సినిమా జోనర్ అటువంటిది. కేజీఎఫ్‌లో కూడా వయోలెన్స్ ఉంది. అయితే అది డిఫరెంట్ వరల్డ్. హిట్ 3 డిఫరెంట్ వరల్డ్.
-నేను దాదాపుగా వయోలెన్స్ ఉన్న సినిమాలే చేశాను. కేజీఎఫ్ డైలాగ్‌లో చెప్పినట్టు 'వయోలెన్స్ ఐ డోంట్ లైక్, బట్ వయోలెన్స్ లైక్స్ మీ (నవ్వుతూ).
-కేజీఎఫ్ 3లో నేను ఉన్నానా లేదా అనేది వెయిట్ అండ్ వాచ్ (నవ్వుతూ).
-నిజానికి ఈ విషయంలో మీకు వివరణ ఇవ్వాలి. మీడియాలో దీనిపై మిస్ కమ్యూనికేషన్ ఉంది. నేను రామాయణం సీత క్యారెక్టర్ కోసం ఆడిషన్ ఇచ్చాను. అదొక్కటే నిజం. ఆ తర్వాత వాళ్ల నుంచి నాకు ఎలాంటి కాల్ రాలేదు. అసలు అలాంటి క్యారెక్టర్‌ని రెజెక్ట్ చేసే అంత పెద్ద యాక్టర్‌ని నేను కాదు.
-నేను ఆడిషన్ ఇచ్చిన మాట మాత్రమే వాస్తవం. ఫైనల్ కాల్ ఆ ఫిలిం మేకర్సే తీసుకున్నారు. ఆ పాత్రకు ఫైనల్‌గా సాయి పల్లవిని ఎంపిక చేశారని మీడియా ద్వారానే తెలుసుకున్నాను.
సంబంధిత కథనం