Hai Nanna: నాలాగే ప్రతి తండ్రికి హత్తుకునే పాట గాజు బొమ్మ.. మహేశ్ బాబు ప్రశంసలు-nani hi nanna gaaju bomma song launch by mahesh babu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hai Nanna: నాలాగే ప్రతి తండ్రికి హత్తుకునే పాట గాజు బొమ్మ.. మహేశ్ బాబు ప్రశంసలు

Hai Nanna: నాలాగే ప్రతి తండ్రికి హత్తుకునే పాట గాజు బొమ్మ.. మహేశ్ బాబు ప్రశంసలు

Sanjiv Kumar HT Telugu
Oct 06, 2023 03:52 PM IST

Hai Nanna Gaaju Bomma Song: నేచురల్ స్టార్ నాని, సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జోడి కట్టిన సినిమా హాయ్ నాన్న నుంచి గాజుబొమ్మ అనే పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు.

హాయ్ నాన్న మూవీ నుంచి గాజు బొమ్మ పాట విడుదల చేసిన మహేశ్ బాబు
హాయ్ నాన్న మూవీ నుంచి గాజు బొమ్మ పాట విడుదల చేసిన మహేశ్ బాబు

నేచురల్ స్టార్ నాని, బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా ఎంటర్ టైనర్ మూవీ 'హాయ్ నాన్నా'. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న హాయ్ నాన్న సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నానికి బేబీ కియారా ఖన్నా కూతురిగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ మంచి హిట్ అయింది.

ఇప్పుడు తాజాగా రెండో సింగిల్ సాంగ్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. "నన్ను కదిలించినట్లే ప్రతి తండ్రిని హత్తుకునే పాటిది. హాయ్ నాన్న సినిమా టీమ్‌కి శుభాకాంక్షలు" అని మహేశ్ బాబు ట్విటర్ వేదికగా ఆల్ ది బెస్ట్ తెలిపాడు. గాజు బొమ్మ ఒక తండ్రి, కూతురు పంచుకునే అందమైన ప్రేమను ఎస్టాబ్లిష్ చేసింది. ఈ పాట తన కూతురికి పంచిన ప్రేమతో పాటు సింగిల్ పేరెంట్‌గా ఉండటంలో తండ్రి భావోద్వేగ అనుబంధం చూపిస్తోంది.

గాజుబొమ్మ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన సంగీతం ఎంతో ఆకట్టుకుంటోంది. తన సొంత వాయిస్‌లో పాటకు భావోద్వేగాలను జోడించాడు. కంపోజింగ్ లో వయోలిన్, ఫ్లూట్, అకౌస్టిక్, బాస్ గిటార్‌ లు వాడిన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో బెస్ట్ సోల్ ఫుల్ నంబర్‌లలో ఈ పాట ఒకటిగా నిలిచేలా ఉంది. అనంత శ్రీరామ్ సాహిత్యం హత్తుకునేలా ఉంది. నాని, కియారా ఖన్నాల లవ్లీ కెమిస్ట్రీ విజువల్స్‌ని అందంగా చూపించింది.

కాగా హాయ్ నాన్నా మూవీని ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే దసరా మూవీతో నాని, సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ ఇద్దరూ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు.

WhatsApp channel