Nani Dasara Teaser : ఎట్లయితే గట్లాయె.. దుమ్మురేపుతున్న నాని 'దసరా' టీజర్
Nani's Dasara Teaser Out Now : నాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీకాంత ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన టీజర్ దుమ్మురేపుతోంది.
నాచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న చిత్రం.. దసరా(Dasara). కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పవ్వ గొట్టు.. అనే పాట దుమ్మురేపుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఐదు భాషల్లో విడుదల చేశారు. తెలుగులో ప్రేక్షకుల ముందు విడుదల అయింది. చిత్ర బృందానికి దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో అభినందనలు తెలిపాడు. విజువల్స్ బాగున్నాయని పేర్కొన్నాడు. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలోనూ టీజర్ విడుదల చేశారు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
ట్రెండింగ్ వార్తలు
ముందుగా చెప్పిన ప్రకారంగా.. మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో తెలంగాణ(Telangana) యాసలో నాని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు.. మందంటే.. మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ నాని వాయిస్ వస్తుంది. పక్కా పల్లెటూరి మాస్ డైలాగ్స్ తో సినిమా టీజర్ ఉంది. నీయవ్వ ఎట్లయితే గట్లాయె.. గుండు గుత్తగా లేపేద్దాం.. అంటూ నాని అదరగొట్టేశాడు.
బొగ్గుగని బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో పక్కా మాస్ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఊర మాస్ లుక్ లో నాని కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ దసరా చిత్రానికి మ్యూజిక్ అందించాడు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. మార్చి 30వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ లో నాని మీద లాస్ట్ శాట్.. చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఉన్నాయి.
నానికి పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అనిపించుకునేందుకు రెడీ అయ్యాడు. అందులో భాగంగా చేసిన సినిమానే దసరా. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో వస్తుంది. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ కాంబినేషన్ ను మళ్లీ రిపీట్ చేస్తూ.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దసరా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.