Nani Dasara Movie: స‌క్సెస్ ఫార్ములాగా మారిన‌ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ - నాని ద‌స‌రాను ఈ ట్రెండ్ గ‌ట్టెక్కిస్తుందా?-nani dasara movie will dasara continues the telangana success trend at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Dasara Movie Will Dasara Continues The Telangana Success Trend At Box Office

Nani Dasara Movie: స‌క్సెస్ ఫార్ములాగా మారిన‌ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ - నాని ద‌స‌రాను ఈ ట్రెండ్ గ‌ట్టెక్కిస్తుందా?

Nelki Naresh Kumar HT Telugu
Mar 17, 2023 06:10 AM IST

Nani Dasara Movie: టాలీవుడ్‌లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ స‌క్సెస్ ఫార్ములాగా మారిపోయింది. ఆ జాబితాలో వ‌స్తోన్న తాజా చిత్రం ద‌స‌రా. ఈ తెలంగాణ నేప‌థ్య క‌థ నానికి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇస్తుందా లేదా అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నాని
నాని

Nani Dasara Movie: ప్ర‌స్తుతం తెలంగాణ నేప‌థ్యం టాలీవుడ్‌లో స‌క్సెస్ ఫార్ములాగా మారిపోయింది. గ‌త కొన్నేళ్ల‌లో ఫిదా, ల‌వ్‌స్టోరీ, వాల్తేర్ వీర‌య్య‌తో పాటు ఇటీవ‌ల విడుద‌లైన బ‌ల‌గం వ‌ర‌కు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ప‌లు సినిమాలు అద్భుత విజ‌యాల్ని సాధించాయి. బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షాన్ని కురిపించాయి.

దాంతో తెలంగాణ క‌థాంశాల‌తో సినిమాల్ని తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తిని చూపుతోన్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న తాజా సినిమా ద‌స‌రా. పూర్తిస్థాయి తెలంగాణ నేటివిటీతో నాని చేస్తోన్న తొలి సినిమా ఇదే. ఈ సినిమా కోసం తెలంగాణ యాస‌ను ప్ర‌త్యేకంగా నేర్చుకున్నాడు నాని.

సింగరేణి కథ…

గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి ప్రాంతంలోని ధ‌ర‌ణి అనే యువ‌కుడి జీవితం చుట్టూ అల్లుకున్న క‌థ‌తో ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బ‌తుక‌మ్మ‌తో పాటు తెలంగాణ క‌ల్చ‌ర్‌ను, ఇక్క‌డి జీవ‌న‌శైలిని చాలా వ‌ర‌కు రియ‌లిస్టిక్‌గా ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

కాగా నాని గ‌త సినిమాల ఫ‌లితంతో సంబంధం లేకుండా కెరీర్‌ల్‌లోనే హ‌య్యెస్ట్ బిజినెస్‌ను జ‌రుపుకోన్న సినిమాగా ద‌స‌రా నిలిచింది. జెర్సీ త‌ర్వాత నానికి బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేదు. శ్యామ్‌సింగ‌రాయ్ హిట్ టాక్ వ‌చ్చినా పెద్ద‌గా లాభాలు మాత్రం రాలేదు.

థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ గ్యాంగ్‌లీడ‌ర్ , అంటే సుంద‌రానికి ఓటీటీలో వ‌చ్చిన వీ, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయాయి. దాంతో ద‌స‌రా స‌క్సెస్ నానికి కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో ద‌స‌రా రిజ‌ల్ట్‌పై టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది

సక్సెస్ జోష్…

బ్లాక్‌బ‌స్ట‌ర్ లోటును నానికి తీర్చే సినిమా ఇద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమాలు వ‌రుస‌గా విజ‌యాల్ని అందుకుంటోన్న నేప‌థ్యంలో ఆ స‌క్సెస్‌ ప‌రంప‌ర‌ను ద‌స‌రా కొన‌సాగిస్తుందా లేదా అన్న‌ది మార్చి 30తో తేల‌నుంది.

నానికి నైజాం ఏరియాలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అత‌డి గ‌త సినిమాలు ఎక్కువ‌గా నైజాం ఏరియాలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. తెలంగాణ నేప‌థ్యం క‌థ కావ‌డంతో ద‌స‌రాకు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే డ‌బుల్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ద‌స‌రా సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.