నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. హిట్ ఫ్రాంచైజీలో హిట్ ది థర్డ్ కేస్ అంటూ వచ్చిన ఈ మూడో సినిమా ఇవాళ (మే 1) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంవహించిన హిట్ 3కి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, మూవీ రిలీజ్‌కు ముందు హీరో నాని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపాడు.
-నా పనిని నేను నిజాయితీగా చేసుకుంటూ వెళ్లడం వల్ల ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది. నన్ను ఆడియన్స్‌ని సపరేట్ చేయను. నేను ప్రేక్షకుల్లో ఒకడినే అనే నమ్మకంతోనే సినిమాలు చేసుకుంటూ వెళుతన్నాను.
-గత రెండు సినిమాలకి ఈ సినిమాకి స్పష్టమైన తేడా ఉంది. అది ట్రైలర్ టీజర్‌లోనే చెప్పేసాం. ఈ సినిమా వరల్డ్ వేరు. ఇది మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ రేంజ్‌లో ఉంటున్నాయని అనుకుంటున్నాను.
-శైలేష్ ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు. కానీ, తను చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మనిషి. మాటల్లోనే జోకులు పేలిపోతుంటాయి. తనకి ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రాయమని చెప్తుంటాను. తను కామెడీ రాస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.
-ఈ రెండు దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. పారడైజ్ ఒక ఎపిక్ స్కేల్‌లో ఉంటుంది. హిట్ 3 ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.
-నేను దీన్ని ట్రాన్స్‌ఫర్‌మేషన్‌గా చూడటం లేదు. ప్రతి సినిమాని ఒక కొత్త జోనర్‌లో చేయాలని ప్రయత్నం చేస్తాను. హాయ్ నాన్న, జెర్సీ, దసరా, ఇప్పుడు హిట్ 3 ఇలా డిఫరెంట్ జోనర్లలో చేసిన సినిమాలే.
-హిట్ 3 వయోలెన్స్ సబ్జెక్ట్‌కు డిమాండ్‌ను బట్టే ఉంటుంది. స్క్రీన్‌పై వయోలెన్స్ చూస్తున్నప్పుడు అది డిస్ట్రబ్ చేసేలా ఉండదు. ఆ వయోలెన్స్ ఎంజాయ్ చేసేలానే ఉంటుంది. సలార్‌లో యాక్షన్ చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు. ఇందులో యాక్షన్ అలానే ఉంటుంది.
-అయితే కేసు తాలూకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో వయోలెన్స్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాంటి వయోలెన్సే ఉంటుంది.
-రాజమౌళి గారు అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్. ఈవెంట్‌కి మిస్ అవ్వకూడదని ఎంత బిజీలో ఉన్న ఆయన రావడం మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. డు సినిమాలకి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. నెక్ట్స్ వచ్చే సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్‌గా రాకపోతే ఎలా అనే టెన్షన్ మొదలైంది (నవ్వుతూ).
సంబంధిత కథనం