Bigg Boss Telugu: బిగ్‍బాస్‍కు గెస్ట్‌గా మాజీ హోస్ట్ నాని.. ‘నువ్వు నా దాస్‍వే’ అన్న నాగ్: ఎలిమినేట్ అయ్యేది అతడేనా!-nani came as guest to bigg boss telugu 7 and goutam krishna may eliminate this week as per reports ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Came As Guest To Bigg Boss Telugu 7 And Goutam Krishna May Eliminate This Week As Per Reports

Bigg Boss Telugu: బిగ్‍బాస్‍కు గెస్ట్‌గా మాజీ హోస్ట్ నాని.. ‘నువ్వు నా దాస్‍వే’ అన్న నాగ్: ఎలిమినేట్ అయ్యేది అతడేనా!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 03, 2023 02:11 PM IST

Bigg Boss 7 Telugu Day 91 Promo: బిగ్‍బాస్‍కు నేచురల్ స్టార్ నాని గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున అతడితో సరదాగా మాట్లాడారు. కంటెస్టెంట్లతోనూ నాని ముచ్చటించారు.

నాగార్జున, నాని
నాగార్జున, నాని

Bigg Boss 7 Telugu Day 91 Promo: బిగ్‍బాస్ 7వ సీజన్‍ 13వ వారం ముగింపునకు వచ్చింది. నేటి ఆదివారం (నవంబర్ 3) ఎపిసోడ్‍లో ఎలిమినేషన్ ఉండనుంది. ఈ ఎపిసోడ్‍కు నేచురల్ స్టార్, హీరో నాని గెస్టుగా వచ్చారు. హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ కోసం ఆయన వచ్చారు. బిగ్‍బాస్ తెలుగు 2వ సీజన్‍కు హోస్ట్‌గా వ్యవహరించిన నాని.. ప్రస్తుత 7వ సీజన్‍కు అతిథిగా వచ్చారు. హోస్ట్ నాగార్జున.. నానితో సరదాగా మచ్చటించారు. కంటెస్టెంట్లతోనూ నాని మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ముందుగా నాని డ్యాన్స్ చేయడంతో ప్రోమో మొదలైంది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున “ఇది సీజన్ 7.. రెండు కాదు” అని నాని సరదాగా అన్నారు. అందుకే గ్యాప్‍లో వచ్చా అని నాని ఆన్సర్ ఇచ్చారు. “నువ్వు నాన్న కాదు.. నాని కాదు.. నువ్వు నా దాస్‍వి.. నేను నీ దేవాను” అని నాగార్జున అన్నారు. ఎప్పటికీ అలానే అని నాని కూడా చెప్పారు. ఇద్దరూ కలిసి నటించిన దేవదాస్ సినిమాను గుర్తు చేసుకున్నారు.

హాయ్ నాన్న సినిమా గురించి చెప్పాలని నాగార్జున అన్నారు. హాయ్ నాన్న సినిమా హాయిగా ఉంటుందని నాని చెప్పారు. “అప్పుడు ఇలాంటి టాపిక్‍లు మీరు టచ్ చేసేవారు. నెక్స్ట్ జనరేషన్ కింద ఆ బాధ్యతను మేం తీసుకున్నాం. డిసెంబర్ 7న అందరూ హాయ్ నాన్న చూసి మీ రెస్పాన్స్ చెబితే వెరీ హ్యాపీ” అని నాని అన్నారు.

అంబటి అర్జున్ అసలైన పేరు అంబటి నాగార్జున అని.. హోస్ట్ నాగ్ చెప్పారు. “ఈ సీజన్‍ మీరు గెలిస్తే కనుక.. హోస్ట్ నాగార్జున.. గెలిచింది నాగార్జున అవుతుంది” అని అర్జున్‍తో నాని అన్నారు. అలా కావాలని కోరుకుంటున్నానని అర్జున్ నవ్వారు. సైకిల్ మీద ప్రేమ కథ స్టార్ట్ చేశావు కదా అని అమర్ దీప్‍తో నాగార్జున అన్నారు. దీంతో జూమ్ ఔట్ చేసి హౌస్‍లో ఎవరెవరు లేడీస్ ఉన్నారో చూపించండి అని నాని అన్నారు.

అయితే, తనకు పెళ్లి అయిందని అమర్ చెప్పారు. దీంతో కల్పించుకున్న అంబటి అర్జున్.. అమర్‌కు ప్రేమ కథ కాదు.. కథలు అని చెప్పారు. తనవన్నీ అయిపోయాయని అమర్ అంటే.. అవన్నీ వైఫ్‍కి చెప్పేశారా అని నాని పంచ్ వేశారు.

ప్రియాంక గురించి చెప్పాలంటూ 4x8 ఎంత అని నానిని నాగ్ అడిగారు. దీంతో ఆయన 32 అని చెప్పారు. 8x4.. 48 అని ప్రియాంక తప్పుగా చెప్పిన ఓ వీడియోను నాగ్ చూపించారు. దీంతో ప్రియాంకకు ఇంట్రడక్షన్ అవసరం లేదని, క్లారిటీ వచ్చిందని నాని అన్నారు.

ప్రిన్స్ యావర్ అని నాగ్ అనగా.. “ప్రిన్సా.. ఏ దేశానికి” అని నాని అన్నారు. అలా అన్నందుకే తనను యావర్ నామినేట్ అర్జున్ చెప్పారు. ఇక యావర్‌కు తెలుగు పద్యం నేర్పాలని నానికి టాస్క్ ఇచ్చారు నాగార్జున. దీంతో విశ్వక్‍సేనుడి.. అంటూ ఓ క్లిష్టమైన లైన్‍ను నాని చెప్పడంతో.. యావర్ దిమ్మతిరిగిపోయింది. దాన్ని అతడు చెప్పలేకపోయారు. చాలా కష్టం అది అని.. పైన నుంచి పోతోంది అని యావర్ అన్నారు. దీంతో అందరూ నవ్వారు.

గౌతమ్ ఎలిమినేట్!

బిగ్‍బాస్ 7వ సీజన్ 13వ వారంలో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ కానున్నారని లీకులు బయటికి వచ్చాయి. గౌతమ్, శోభా చివర్లో డేంజర్ జోన్‍లో ఉండనున్నారని… అయితే చివరికి గౌతమ్ ఎలిమినేట్ అయ్యారని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయం నేటి ఎపిసోడ్‍లో తేలనుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.