Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..-nani and mrunal thakur hi nanna movie wins six awards at swedish international film festival 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 05, 2024 10:50 PM IST

Hi Nanna Awards: హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలు కూడా దక్కాయి. కాగా, మరో అంతర్జాతీయ వేదికలో ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది.

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికలో అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..
Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికలో అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Hi Nanna Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఫీల్ గుడ్ మూవీ ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. అలాగే, మంచి సినిమా అంటూ ప్రశంసలు దక్కించుకుంది. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజైన హాయ్ నాన్న చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తన తొలి సినిమానే అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు శౌర్యువ్‍పై ప్రశంసలు వచ్చాయి. హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట పండింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మే 5) వెల్లడించింది.

ఆరు అవార్డులు

స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍ 2024లో హాయ్ నాన్న సినిమా ఏకంగా ఆరు అవార్డులు సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక ఇంటర్నేషన్ వేదికపై ఈ చిత్రం మెరిసింది.

అత్యుత్తమ యాక్టింగ్ జోడీగా నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు కలిపి ఈ స్వీడిష్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో అవార్డు దక్కింది. అలాగే, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అవార్డులను దర్శకుడు శౌర్యువ్ సొంతం చేసుకున్నారు. బెస్ట్ బ్యాక్‍గ్రౌండ్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ స్టోర్ విభాగాల్లో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్‍కు అవార్డులు దక్కాయి. ఇలా.. ఈ స్వీడెష్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో వాహబ్‍కు మూడు, డైరెక్టర్ శౌర్యువ్‍కు రెండు, నాని - మృణాల్‍కు కలిపి ఓ అవార్డు దక్కింది.

హాయ్ నాన్న సినిమాకు అవార్డులు రావడం పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ప్రేమ, ప్రశంసలతో సినిమా సెలెబ్రేషన్ జరుగుతోంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో హాయ్ నాన్న ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ప్రేమకు అసలైన ప్రతిధ్వని ఇది. 18 ఇంటర్నేషనల్ అవార్డులు.. కౌటింగ్” అని వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు ట్వీట్ చేసింది.

న్యూయార్క్ వేదికగా జరిగిన ఓనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో ఈ ఏడాది ఏప్రిల్‍లో హాయ్ నాన్న మూవీకి ఏకంగా 11 పురస్కారాలు దక్కాయి. మార్చిలో ఏథేన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‍లోనూ ఓ అవార్డు సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా స్వీడిష్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో ఇప్పటి వరకు హాయ్ నాన్నకు 18 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.

హాయ్ నాన్న కలెక్షన్లు

హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు సాధించింది. మోస్తరు బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ.76కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో సూపర్ హిట్‍గా నిలిచింది.

ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్

హాయ్ నాన్న సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ ఏడాది జనవరిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఓటీటీలో హాయ్ నాన్న చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ వ్యూస్ దక్కించుకుంది. చాలా వారాల పాటు నేషనల్ వైడ్‍లో ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది. ఇప్పటికీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఆ రేంజ్‍లో ఓటీటీలో సూపర్ సక్సెస్ అయింది హాయ్ నాన్న.

హాయ్ నాన్న చిత్రంలో నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా నటించారు. లవ్ స్టోరీతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‍తో ఈ చిత్రం మెప్పించింది. దర్శకుడు శౌర్యవ్ ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై పొగడ్తలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యాయి. వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మించింది.