హిట్ 3, రెట్రో ఓటీటీ రిలీజ్.. ఒకే ప్లాట్‍ఫామ్ చేతిలో స్ట్రీమింగ్ హక్కులు.. ఏది ముందు.. ఏది వెనుక?-nani action thriller hit 3 and suriya retro movies will be streaming on netflix ott soon but curiosity in this aspect ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హిట్ 3, రెట్రో ఓటీటీ రిలీజ్.. ఒకే ప్లాట్‍ఫామ్ చేతిలో స్ట్రీమింగ్ హక్కులు.. ఏది ముందు.. ఏది వెనుక?

హిట్ 3, రెట్రో ఓటీటీ రిలీజ్.. ఒకే ప్లాట్‍ఫామ్ చేతిలో స్ట్రీమింగ్ హక్కులు.. ఏది ముందు.. ఏది వెనుక?

హిట్ 3, రెట్రో చిత్రాలు ఒకే రోజు థియేటర్లలో రిలీజయ్యాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు ఒకే ప్లాట్‍ఫామ్ దగ్గర ఉన్నాయి. దీంతో ఈ సినిమాల్లో ఏది ముందు స్ట్రీమింగ్‍కు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

హిట్ 3, రెట్రో ఓటీటీ రిలీజ్.. ఒకే ఓటీటీ చేతిలో హక్కులు.. ఏది ముందు.. ఏది వెనుక?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మంచి హిట్ అయింది. స్టార్ హీరో సూర్య నటించిన యాక్షన్ మూవీ ‘రెట్రో’ కూడా మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు సాధించింది. కాగా, ఒకే రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. దీంతో స్ట్రీమింగ్‍పై క్యూరియాసిటీ నెలకొంది.

ముందు ఏది?

హిట్ 3, రెట్రో సినిమాలను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఒకే వారం తీసుకొని రాకపోవచ్చు. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేలా నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుంది. దీంతో ఈ రెండు సినిమాల్లో దేన్ని ముందు స్ట్రీమింగ్‍‌కు తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

జూన్ 5వ తేదీన రెట్రో సినిమాను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు ప్లాన్ చేసిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే, హిట్ 3ని ఈ మే నెలాఖరులోనే తీసుకొస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. లేకపోతే రెట్రోనే వాయిదా వేస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఒకేవారంలో ఈ రెండు చిత్రాలను తీసుకొస్తే అది ఆశ్చర్యమే.

మొత్తంగా హిట్ 3, రెట్రో సినిమాల స్ట్రీమింగ్‍కు నెట్‍ఫ్లిక్స్ ఎలాంటి ప్లాన్ చేసిందనే క్యూరియాసిటీ బాగా నెలకొంది. ఈ సినిమాల స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వస్తాయి. మరి డేట్‍లపై ఆ ప్లాట్‍ఫామ్ ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

వైలెన్స్‌తో రెచ్చిపోయిన నాని

హిట్ 3 మూవీలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రను నాని పోషించారు. ఈ మూవీలో వైలెంట్ యాక్షన్‍తో అదరగొట్టారు. సూపర్ పర్ఫార్మెన్స్ చేశారు. హిట్ ఫ్రాంచైజీలోని ఈ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద జోరు చూపింది. ఈ సినిమా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది.

హిట్ 3 సినిమాను నానినే నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీలో నాని, శ్రీనిధితో పాటు కోమలీ ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సముద్రఖని, రావు రమేశ్ కీరోల్స్ చేశారు.

రెట్రో కూడా రూ.100కోట్లు క్రాస్

రెట్రో సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. లవ్ స్టోరీ కూడా మెయిన్‍గా ఉంటుంది. ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‍గా చేశారు. రెట్రో చిత్రానికి ముందుగా నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి రన్ సాధించింది. దీంతో రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. హిట్‍గా నిలిచింది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం