Nandamuri Ramakrishna Accident: రోడ్డు ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌య‌ట‌ప‌డ్డ బాల‌కృష్ణ సోద‌రుడు-nandamuri ramakrishna meets with a car accident in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nandamuri Ramakrishna Meets With A Car Accident In Hyderabad

Nandamuri Ramakrishna Accident: రోడ్డు ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌య‌ట‌ప‌డ్డ బాల‌కృష్ణ సోద‌రుడు

Nelki Naresh Kumar HT Telugu
Feb 11, 2023 06:02 PM IST

Nandamuri Ramakrishna Accident: నంద‌మూరి బాల‌కృష్ణ సోద‌రుడు రామ‌కృష్ణ రోడ్డు ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న ప్ర‌యాణిస్తోన్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొన్న‌ట్లు తెలిసింది.

నంద‌మూరి రామ‌కృష్ణ
నంద‌మూరి రామ‌కృష్ణ

Nandamuri Ramakrishna Accident: నంద‌మూరి బాల‌కృష్ణ సోద‌రుడు రామ‌కృష్ణ పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. శుక్ర‌వారం రామ‌కృష్ణ ప్ర‌యాణిస్తోన్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొన్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో ముందుభాగం పూర్తిగా దెబ్బ‌తింది. ఈ ప్ర‌మాదం నుంచి రామ‌కృష్ణ క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని తెలిసింది.

జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 10లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌మాచారం. యాక్సిడెంట్ త‌ర్వాత కారును అక్క‌డే నిలిపివేసి రామ‌కృష్ణ వెళ్లిపోయిన‌ట్లు తెలిసింది. అయితే కారు ప్ర‌మాదం ఎ లా జ‌రిగింద‌న్న‌ది పూర్తిగా తెలియ‌రాలేదు.

కారు దెబ్బ‌తిన్న ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని తెలిసింది. కాగా నంద‌మూరి ఫ్యామిలీలో రోడ్డు ప్ర‌మాదాలు తీర‌ని విషాదాల్ని మిగిల్చాయి.

నంద‌మూరి హ‌రికృష్ణ‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు జాన‌కీరామ్ రోడ్డు ప్ర‌మాదంలోనే క‌న్నుమూశారు. అందుకే త‌మ ప్ర‌తి సినిమా వేడుక‌లో ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ రోడ్డు ప్ర‌మాదాల బారిన ప‌ట్ట అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉంటారు.

IPL_Entry_Point

టాపిక్