Nandamuri Mokshagna Teja: అఫీషియల్ - బాలకృష్ణ ఫేవరేట్ జోనర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
Nandamuri Mokshagna Teja: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీ కన్ఫామ్ అయ్యింది. మోక్షజ్ఞతేజ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఈ మూవీని ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు.
Nandamuri Mokshagna Teja: టాలీవుడ్‌కు కొత్త వారసుడు పరిచయం కాబోతున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. అతడు మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞతేజ. శుక్రవారం మోక్షజ్ఞతేజ బర్త్‌డే సందర్భంగా అతడి డెబ్యూ మూవీని ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
కొత్త లుక్ వైరల్...
ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు మోక్షజ్ఞతేజ కొత్త లుక్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో స్టైలిష్ లుక్‌లో మోక్షజ్ఞ తేజ కనిపిస్తోన్నాడు. మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పురాణాల నుంచి స్ఫూర్తి…
భారతీయ పురాణాలు, ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందుతూ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మఈ మూవీని రూపొందిస్తోన్నట్లు సమాచారం. మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీలో పురాణాల్లోని గొప్ప యోధుడి ప్రస్తావన ఉంటుందని అంటున్నారు. అంతర్లీనంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు లవ్‌స్టోరీ, యాక్షన్ అంశాలు ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.
తేజస్విని ప్రజెంటర్...
మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీకి అతడి సోదరి, బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నందమూరి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది. దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మోక్షజ్ఞ తేజ ఫస్ట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్...
నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ ఈ మూవీతో హీరోగా పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉందని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి మోక్షజ్ఞ తేజను ఆహ్వానిస్తోన్నట్లు ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.
బాలకృష్ణ విజన్…
బాలకృష్ణ విజన్‌కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని, నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి మెమోరబుల్ మూవీగా మోక్షజ్ఞతేజ ఫస్ట్ మూవీ నిలుస్తుందని ప్రశాంత్ వర్మ చెప్పాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే మూవీ ఇదని అన్నాడు.
అక్టోబర్ లో లాంఛ్…
కాగా ఈ డెబ్యూ మూవీ కోసం మోక్షజ్ఞ తేజ యాక్టింగ్‌తో పాటు డ్యాన్సులు, యాక్షన్ సీన్స్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ఈ సినిమా ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు సమాచారం.
అదే రోజు షూటింగ్‌తో పాటు హీరోయిన్, ఇతర నటీనటుల వివరాల్ని వెల్లడించబోతున్నట్లు తెలిసింది. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై చాలా కాలంగా వార్తలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ కంటే ముందు అనిల్ రావిపూడితో పాటు మరికొందరు దర్శకుల పేర్లు వినిపించాయి. చివరకు ప్రశాంత్ వర్మ మూవీతో అతడు హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.