Arjun S/O Vyjayanthi First Song Naayaldhi Release Date: హిట్స్, ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. బింబిసార మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్లాప్స్ అందుకున్నాడు.
ఇప్పుడు నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సరికొత్త ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. నందమూరి కల్యాణ్ రామ్ అభిమానుల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఉంది. ఈ సినిమా సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రల మధ్య డైనమిక్స్ కీలకంగా ఉండనున్నాయి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇటివలే రిలీజ్ చేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నాయాల్ది సాంగ్‌ని మార్చి 31న రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ స్టన్నింగ్ క్లాస్ లుక్‌లో, ఉర్రూతలూగించే మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించడం అదిరిపోయింది.
బ్యాక్ డ్రాప్ కార్నివాల్ వాతావరణం, డ్యాన్స్ ట్రూప్.. పండుగ వైబ్‌ని పెంచుతోంది. నాయల్ది మాస్ డ్యాన్స్ నంబర్ అని పోస్టర్ సూచిస్తోంది. ఈ సినిమా కోసం అజనీష్ లోక్‌నాథ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. అయితే, నాయాల్ది అనేది దివంగత, రెబల్ స్టార్ కృష్ణంరాజు హుక్ డైలాగ్ అని తెలిసిందే. "నాయాల్ది కత్తి అందుకో జానకి" అని కృష్ణంరాజు చెప్పిన డైలాగ్ టాలీవుడ్‌లో ఒక క్రేజ్ క్రియేట్ చేసింది.
ఇటీవల కాలంలో ఆ డైలాగ్‌ను కామెడీగా, మీమ్స్‌లో వాడుతున్నారు. కానీ, అప్పట్లో కృష్ణంరాజు చెప్పిన ఈ డైలాగ్ విజిల్స్ వేయించింది. అలాంటి కృష్ణంరాజు హుక్ డైలాగ్‌తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్ట్ సింగిల్ సాంగ్ రావడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. రెండ్రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సాంగ్ ఎలా ఉంటుందా అని అటు రెబల్ స్టార్ ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం