Balakrishna Thaman: తమన్‌కు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన బాలకృష్ణ.. ఆ కారు, దాని ఖరీదు ఎంతో తెలుసా?
Balakrishna Gifted Costly Car To Thaman: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ కాస్ట్‌లీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో ఆ కారు ఏంటీ, దాని ఖరీదు ఎంత అనే వివరాలు ఆసక్తిగా మారాయి.

Balakrishna Gifted Costly Car To Thaman: కొన్ని కాంబినేషన్స్ అదిరిపోతుంటాయి. వాటికి యమ క్రేజ్ ఉంటుంది. అది హీరో-డైరెక్టర్ కాంబో అయినా లేదా మ్యూజిక్ డైరెక్టర్-హీరో అయినా సరే. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషనే నందమూరి నటసింహం బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌ది.
బాలకృష్ణ సోదరి స్వయంగా
బాలకృష్ణకు వరుసగా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన తమన్ నందమూరి కుటుంబానికి బాగా దగ్గరైపోయాడు. ఎంతలా అంటే చివరికీ బాలయ్య సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి సైతం నందమూరి తమన్ అని చెప్పేంతలా ఆ ఇంటివాడు అయ్యాడు ఈ సంగీత దర్శకుడు.
బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్‌కు
ఇక బాలయ్య-తమన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో బీజీఎమ్, సంగీతం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అఖండ మూవీతో మొదలైన వీరి ప్రయాణం లేటెస్ట్ డాకు మహారాజ్ వరకు కొనసాగుతోంది. బాలకృష్ణకు సరితూగే బీజీఎమ్ కొట్టేది కేవలం తమన్ మాత్రమే అనేంతలా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్‌కు తమన్ బీజీఎమ్ తోడు అయితే థియేటర్లలో సౌండ్స్ బద్దలు అయ్యేలా, సీట్లు చినిగిపోయేలా ఉంటుంది.
అదిరిపోయే కాస్ట్‌లీ గిఫ్ట్
ఇంతలా తమన్-బాలకృష్ణ బంధం పెనవేసుకుపోయింది. అయితే, తాజాగా బాలయ్య-తమన్ బంధాన్ని రెట్టింపు చేశాడు గాడ్ ఆఫ్ మాసెస్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు అదిరిపోయే కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడు బాలకృష్ణ. అత్యంత ఖరీదైన, లగ్జరీ కార్లలో ఒకటైన న్యూ బ్రాండెడ్ పోర్స్చే కారును తమన్‌కు బహుమతిగా అందించాడు బాలయ్య.
హాట్ టాపిక్‌గా కారు ధర
ఈ కారును స్వయంగా బాలకృష్ణ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించి మరి తమన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తమన్‌కు బాలకృష్ణ కారు గిఫ్ట్‌గా అందించిన విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే, ఆ కారు, దాని ఖరీదు వివరాలు ఆసక్తిగా మారాయి.
ఇండియా మార్కెట్‌లో
తమన్‌కు బాలకృష్ణ బహుమతిగా ఇచ్చి పోర్స్చే కారు ధర సుమారుగా రూ. కోటికిపైగానే ఉంటుందని సమాచారం. అయితే, పోర్స్చే కారు ధరలు ఇండియాలో రూ. 96.05 లక్షల నుంచి రూ. 1.99 కోట్ల వరకు మోడల్‌ను బట్టి ఉన్నాయి. మరి తమన్‌కు బాలకృష్ణ గిఫ్ట్‌గా అందించి కారు మోడల్ ఏంటనేది ఇంకా తెలియరాలేదు.
తమిళంలో ఎక్కువగా
ఇదిలా ఉంటే, సాధారణంగా సంగీత దర్శకులకు, హీరోలకు దర్శకనిర్మాతలు బహుమతులు ఇవ్వడం, అది కూడా ఎక్కువడా తమిళ సినీ ఇండస్ట్రీలో జరుగుతుంటుంది. కానీ, తొలిసారిగా ఒక స్టార్ హీరోనే మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇలా కారు కొని స్వయంగా గిఫ్ట్ ఇవ్వడం టాలీవుడ్‌లో జరిగిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య-తమన్ కాంబో సినిమాలు
ఇక, బాలకృష్ణ-తమన్ కాంబినేషన్‌లో అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలు వచ్చాయి. అన్నింట్లో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌తో ఇరగదీశాడు. ఇప్పుడు అఖండ 2 కోసం వర్క్ చేస్తున్నాడు తమన్. మరి బాలయ్య-తమన్ కాంబినేషన్‌లో ఐదో సినిమాగా వస్తున్న అఖండ 2 చిత్రానికి తమన్ ఎలాంటి బీజీఎమ్, సంగీతం అందిస్తాడో వేచి చూడాలి.
సంబంధిత కథనం