Thaman: ‘ఇంకెప్పుడు’: థమన్పై బాలకృష్ణ అభిమానుల అసంతృప్తి.. ఎందుకంటే..
Thaman: మ్యూజిక్ డైరెక్టర్ థమన్పై బాలకృష్ణ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓఎస్టీ గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకెప్పుడు అంటూ అడుగుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
డాకు మహరాజ్ చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆ మూవీకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులకు వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఊపేసింది. బాలయ్యకు మరోసారి అదిరిపోయే బీజీఎంలతో థమన్ అదరగొట్టారు. దీంతో డాకు మహరాజ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ (ఓఎస్టీ).. ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. థమన్ ఇప్పటికే అప్డేట్ ఇచ్చినా.. ఇంకా ఓఎస్టీని తీసుకురాలేదు. ఆ వివరాలు ఇవే..
ప్రశ్నిస్తున్న బాలయ్య ఫ్యాన్స్
డాకు మహరాజ్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్లతో కూడిన ఓఎస్టీ వచ్చేస్తోందంటూ ఇప్పటికే థమన్ హింట్స్ ఇచ్చారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓఎస్టీని తీసుకొస్తామంటూ ట్వీట్‌తో చెప్పారు. అయితే, అలా జరగలేదు. 27 బీజీఎం ట్రాక్‌లతో పాటు పాటు మరో స్పెషల్ సాంగ్ కూడా ఈ ఓఎస్టీలో ఉంటుందని బజ్ నడిచింది. దీంతో అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది.
అయితే, ఫిబ్రవరి 13న డాకు మహరాజ్ ఓఎస్టీ రాలేదు. ఆ తేదీ గడిచి ఐదో రోజులు అవుతున్నా థమన్ కూడా ఎలాంటి అప్డేట్లు ఇవ్వలేదు. దీంతో థమన్‌ను సోషల్ మీడియా వేదికగా కొందరు బాలకృష్ణ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు తీసుకొస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం అప్డేట్ ఇవ్వాలని, ఆలస్యమైతే కారణం చెప్పాలి కదా అంటున్నారు. మరి ఈ డిమాండ్లకు థమన్ స్పందిస్తారేమో చూడాలి.
డాకు మహరాజ్ ఓటీటీ డేట్
డాకు మహరాజ్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు కూడా రెడీ అయింది. ఈ శుక్రవారం ఫిబ్రవరి 21వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా అడుగుపెట్టనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ డేట్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి ఓటీటీలోకి వచ్చేలోగా డాకు మహరాజ్ ఓఎస్టీ ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
వరుసగా తన చిత్రాలతో అదిరిపోయే మ్యూజిక్ ఇస్తుండటంతో ఓ సందర్భంలో థమన్‌ను.. నందమూరి థమన్ అని కూడా బాలకృష్ణ అన్నారు. ఆయన అభిమానులు కూడా ముద్దుగా అలా పిలుచుకుంటున్నారు. ఇటీవలే థమన్‌కు ఓ లగ్జరీ కారును కూడా బాలకృష్ణ గిఫ్టుగా ఇచ్చారు. బాలయ్య తదుపరి చిత్రం అఖండ 2కు కూడా థమనే సంగీతం అందించనున్నారు.
డాకు మహరాజ్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రూ.150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించిందని మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో బాలకృష్ణకు ఇది వరుసగా నాలుగో రూ.100కోట్ల చిత్రంగా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్‌పాండే కీరోల్స్ చేశారు. ఈ సినిమాకు విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ చేశారు.డాకు మహరాజ్‌కు ప్రీక్వెల్ చేసే ప్లాన్ కూడా ఉందని నిర్మాత నాగవంశీ సక్సెస్ మీట్లో చెప్పారు.
సంబంధిత కథనం