NBK 108 Update: ఉగాదికి బాలయ్య అభిమానులకు సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరింది
NBK 108 Update: ఉగాది సందర్భంగా బాలయ్య తన అభిమానులు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరెకక్కుతోన్న NBK108 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా చేస్తోంది.

NBK 108 Update: ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందు సందడి చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మెరుగైన వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
“దిస్ టైమ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్(ఈ సారి మీ ఊహలకు కూడా అందదు)” అంటూ ట్విటర్ వేదికగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు.
అఖండ, వీరసింహారెడ్డి బ్లాక్ బాస్టర్ల తర్వాత తెరకెక్కుతోన్న NBK108 మూవీపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఫస్ట్ లుక్ బాలయ్య అదరగొట్టారు. పవర్‌ఫుల్‌గా కనిపించారు. గ్రే కలర్ గడ్డంతో, పదునైన మీస కట్టుతో బాలయ్య మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉన్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమా కావడం విశేషం.
షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడు పోషించని పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు అనిల్ రావిపూడి తాలుకూ కామెండీ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. బాలయ్య స్టార్‍డమ్‌ను దృష్టిలో ఉంచుకుని అనిల్ ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారు.
సంబంధిత కథనం