Daaku Maharaj OTT Release: డాకు మహరాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా! ఎందుకిలా..-nandamuri balakrishna action movie daaku maharaj ott release on netflix delaying for these reason ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Daaku Maharaj Ott Release: డాకు మహరాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా! ఎందుకిలా..

Daaku Maharaj OTT Release: డాకు మహరాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా! ఎందుకిలా..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 12, 2025 03:16 PM IST

Daaku Maharaj OTT Release: డాకు మహారాజ్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, అంచనాలకు తగ్గట్టు కాకుండా స్ట్రీమింగ్ ఆలస్యమవుతోంది. ఇందుకు కారణమేంటో తాజాగా బయటికి వచ్చింది.

Daaku Maharaj OTT Release: డాకు మహరాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా! ఎందుకిలా..
Daaku Maharaj OTT Release: డాకు మహరాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా! ఎందుకిలా..

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహరాజ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ విడుదలై నేటికి (ఫిబ్రవరి 12) సరిగ్గా నెలైంది. ఈ యాక్షన్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. డాకు మహరాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సూపర్ హిట్ అయింది. అయితే, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం అనుకున్న దాని కంటే ఆలస్యమవుతోంది. ఎందుకిలా అవుతుందో తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది.

కారణం ఇదేనా!

డాకు మహారాజ్ చిత్రం థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ ముందుగా అంచనాలు వెలువడ్డాయి. దీన్నిబట్టి ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్‍కు రానుందంటూ సమాచారం చక్కర్లు కొట్టింది. అయితే, ఆరోజున డాకు మహారాజ్ ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. స్ట్రీమింగ్ ఆలస్యమయ్యేందుకు ఓ కారణం ఉందంటూ ప్రస్తుతం సమాచారం బయటికి వచ్చింది.

థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు తేవాలని టాలీవుడ్ ప్రొడ్యూజర్ కౌన్సిల్ ఓ ప్రతిపాదన చేసింది. దీన్ని డాకు మహారాజ్ మేకర్స్ పాటించాలని అనుకుంటున్నారని, అందుకే స్ట్రీమింగ్‍కు ఇంకా రాలేదంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఇతర భాషల డబ్బింగ్‍ను మూవీ టీమ్ ఇంకా సిద్ధం చేయకపోవటంతో నెట్‍ఫ్లిక్స్ వేచిచూస్తోందని కూడా మరో వాదన వినిపిస్తోంది. మొత్తంగా డాకు మహరాజ్ స్ట్రీమింగ్ మాత్రం ఆలస్యమయ్యేలా ఉంది.

అప్పటి వరకు వెయిటింగ్ తప్పదా!

ఒకవేళ 50 రోజుల నిబంధనను డాకు మహరాజ్ పాటిస్తే.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మార్చి రెండో వారం వరకు వేచిచూడాల్సి రావొచ్చు. మార్చి 3వ తేదీకి ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఒకవేళ డబ్బింగ్ వెర్షన్‍లు సమస్య అయితే అంతకంటే ముందే రావొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. నెట్‍ఫ్లిక్స్ కానీ, మూవీ టీమ్ కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ప్రొడ్యూజర్ కౌన్సిల్ ప్రతిపాదనను చాలా చిత్రాలు మాత్రం పట్టించుకోవడం లేదు. సంక్రాంతి సమయంలోనే రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది.

డాకు మహరాజ్ మూవీ రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అధిగమించిందని మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో బాలయ్య ఖాతాలో మరో హిట్ చేరింది. స్టైలిష్ యాక్షన్ మూవీగా డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించారు. బాలకృష్ణ మూడు గెటప్‍ల్లో కనిపించారు. తన మార్క్ యాక్షన్‍తో అదరగొట్టారు. అభిమానులను మెప్పించారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు.

డాకు మహరాజ్ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్‍పాండే, ఊర్వశి రౌతేలా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించారు. మరోసారి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో మ్యాజిక్ చేశారు. ఈ సినిమాలో బీజీఎంపై చాలా ప్రశంసలు దక్కాయి.

బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తున్నారు. బ్లాక్‍బస్టర్ అఖండకు సీక్వెల్‍గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం