Namrata Shirodkar - Miss Universe Title: ఆ ప్రశ్న వల్లే నమ్రత మిస్ యూనివర్స్ టైటిల్ చేజారిందా - ఓల్డ్ వీడియో వైరల్
Namrata Shirodkar - Miss Universe Title: 1993లో నమ్రతా శిరోద్కర్ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అందాల పోటీల నిర్వహకులు అడిగిన తాత్విక ప్రశ్నకు నమ్రత చెప్పిన సమాధానంపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
Namrata Shirodkar - Miss Universe Title: మహేష్‌బాబుతో పెళ్లికి ముందు నమ్రతా శిరోద్కర్ బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. మిస్ ఇండియాగా ఎంపికైన ఆమె 1993లో మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్నది. ఈ పోటీల్లో ఫైనల్ చేరిన నమ్రత ఆరోస్థానంతో సరిపెట్టుకున్నది.
ట్రెండింగ్ వార్తలు
మిస్ యూనివర్స్ కిరీటాన్ని నమ్రత గెలిచే అవకాశం ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ కల నెరవేరలేదు. అయితే మిస్ యూనివర్స్ పోటీల్లో నమ్రత పాల్గొన్న పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో అందాల పోటీ నిర్వహకులు అడిగిన పలు ప్రశ్నలకు నమ్రత బదులిస్తూ కనిపిస్తోంది.
అయితే ఇందులో ఓ ప్రశ్నకు నమ్రత చెప్పిన సమాధానం వల్లే ఆమె మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజార్చుకున్నదని నెటిజన్లు చెబుతున్నారు. ఇందులో మీరు కలకాలం జీవించి ఉండాలని కోరుకుంటున్నారా అంటూ తాత్విక ధోరణిలో నిర్వహకులు నమ్రతా శిరోద్కర్‌ను ప్రశ్న అడిగారు.
ఎల్లకాలంఎవరూ జీవించలేరు. అది అసాధ్యం అంటూ ప్రాక్టికల్‌గా నమ్రత సమాధానం చెప్పింది. ఆమె ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయినా సింపుల్ ఆన్సర్ ఇవ్వడం వల్లే నమ్రత శిరోద్కర్ మిస్ యూనివర్స్ రేసు నుంచి నిష్క్రమించిందని నెటిజన్లు చెబుతున్నారు.
ఈ ఫిలాసఫికల్ క్వశ్చన్‌కు కలకాలం జీవించడం ఎందుకు అసాధ్యమన్నది లోతుగా విశ్లేషిస్తూ ఆన్సర్ ఇస్తే నమ్రత తప్పకుండా టైటిల్ గెలిచేదని అంటున్నారు. ఎస్ ఆర్ నో క్వశ్చన్ టైప్‌లో నమ్రత సింపుల్ ఆన్సర్ ఇవ్వడం బాగాలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం నమ్రత సమాధానం చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంశీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చించి నమ్రతా శిరోద్కర్. ఈ సినిమా షూటింగ్‌లోనే మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.