Namo Namah Shivaya Lyrics: నాగచైతన్య, సాయిపల్లవి శివతాండవం - న‌మో న‌మః శివాయ‌ సాంగ్ లిరిక్స్ ఇవిగో...-namo namah shivaya song from thandel unveiled naga chaitanya sai pallavi devotional treat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Namo Namah Shivaya Lyrics: నాగచైతన్య, సాయిపల్లవి శివతాండవం - న‌మో న‌మః శివాయ‌ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Namo Namah Shivaya Lyrics: నాగచైతన్య, సాయిపల్లవి శివతాండవం - న‌మో న‌మః శివాయ‌ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Nelki Naresh Kumar HT Telugu
Jan 04, 2025 10:07 PM IST

Song Lyrics: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించిన తండేల్ మూవీ నుంచి న‌మో నమః శివాయ సాంగ్‌ను మేక‌ర్స్ శ‌నివారం రిలీజ్ చేశారు. డివోష‌న‌ల్ ట‌చ్‌తో కూడిన ఈ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి, హ‌రిప్రియ ఆల‌పించారు. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు.

 న‌మో న‌మః శివాయ లిరిక్స్
న‌మో న‌మః శివాయ లిరిక్స్

Namo Namah Shivaya Lyrics: నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. న‌మో న‌మః శివాయ లిరిక‌ల్ వీడియోను మేక‌ర్స్ శ‌నివారం రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది సేప‌ట్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది.

yearly horoscope entry point

డివోష‌న‌ల్ ట‌చ్‌తో...

భ‌క్తి ప్ర‌ధానంగా సాగిన న‌మో న‌మః శివాయ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి, హ‌రిప్రియ‌ ఆల‌పించారు. శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని చూపిస్తూ జొన్న‌విత్తుల ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. . డివోష‌న‌ల్ ట‌చ్‌తో సాగిన ఈ పాట‌కు దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ తో పాటు విజువ‌ల్స్‌, డ్యాన్స్ హైలైట్‌గా నిలుస్తోన్నాయి. న‌మో న‌మః శివ‌యా పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. డ్యాన్స్ ద్వారా శివుడి శ‌క్తిని, మ‌హిమ‌ల్ని పాట‌లో ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

43 మిలియ‌న్ల వ్యూస్‌...

తండేల్ నుంచి ఇప్ప‌టికే రిలీజ్ చేసిన బుజ్జిత‌ల్లి పాట పెద్ద హిట్ట‌య్యింది. 43మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. న‌మో న‌మః శివాయ కూడా అదే స్థాయిలో ట్రెండింగ్ అవుతోంద‌ని మేక‌ర్స్ భావిస్తోన్నారు.

ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్‌...

ల‌వ్‌స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న మూవీ ఇది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. డిసెంబ‌ర్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ థియేట‌ర్ ఇష్యూస్‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగా ఫిబ్ర‌వ‌రికి వాయిదాప‌డింది.తండేల్ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందిస్తోండ‌గా...నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా ప‌నిచేస్తోన్నారు.

న‌మో న‌మః శివాయ సాంగ్ లిరిక్స్‌...

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

హే ఢమ ఢమ ఢమ్ అదరగొట్టు

ఢమరుకాన్ని దంచికొట్టు

అష్టదిక్కుల అదిరేటట్టు

తాండవేశ్వర..

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

భమ్ భమ్ భమ్ మొదలుపెట్టు

అమృతాన్ని పంచిపెట్టు

గుండె వెండికొండైయేట్టు

కుండలేశ్వర..

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

జై శంకర

జై జై జై శంకర

నిప్పు కన్ను ఇప్పి

జనం తప్పులు కాల్చేయ్యరా

జై శంకర

శివ శివ శివ శంకర

త్రిశులం తిప్పి సూపి

మంచి దారి నడపరా

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

తప్పు చేస్తే బ్రహ్మ తలనే తుంచినావురా

వేడుకుంటే విషనైనా మింగినావురా

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా

సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

రారా శివరాత్రి సుందర

మా రాత మార్చి ఉద్దరించరా

అనంతమైన నీ ప్రేమలో

రవ్వంత మాకు ఇస్తే

భూమి స్వర్గమౌనురా

నమో నమః

నమో నమః

నమో నమః శివాయ

ఆది ప్రేమిక నీకు పోలిక

లేదు లేదిక జగాన

భక్త కోటికి ఉన్న కోరిక

తీర్చుతావయ్యా స్వయానా

ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడైయ్యావు

లోకాన్నే ఏలు పరమేశ్వరుడా

ఏలోటూ రానీవు ఎప్పుడు తోడుంటావు

మగడంటే నువ్వే మహేశ్వరుడా

ఆది నువ్వే అంతం నువ్వే

కాపాడే ఆపద్భాంధవుడా…

Whats_app_banner