బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్లో ఐదో వారం ఎలిమినేషన్లో ట్విస్టులు సాగాయి. మిడ్‌వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఆదిత్య ఓం వారం మధ్యలోనే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇప్పుడు వీకెండ్ వచ్చేసింది. దీంతో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉండగా.. ఒకరు ఔట్ అవనున్నారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఇప్పటికే సమాచారం బయటికి వచ్చేసింది. ఆ వివరాలు ఇవే..
బిగ్‌బాస్ 8 ఐదో వారంలో డ్యాన్సర్ నైనిక ఎలిమినేట్ కానున్నారని సమాచారం బయటికి వెల్లడైంది. ఈ వారం నామినేషన్లలో ఉన్న ఆమెకు తక్కువ ఓటింగ్ రావటంతో హౌస్‌లో నుంచి బయటికి రావడం దాదాపు ఫిక్స్ అయింది. ఆరంభంలో నైనికపై భారీ అంచనాలు ఉండేవి. టైటిల్ ఫేవరెట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఐదో వారంలోనే నైనిక ఇంటి ముఖం పట్టనున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో నైనిక గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. తొలి వారంలో యాక్టివ్‌గా ఆమె మంచి ఎంటర్టైన్మెంట్ పంచారు. టాస్కుల్లో చలాకీగా ఉన్నారు. అయితే, ఆ తర్వాత ఆమె గ్రాఫ్ క్రమంగా తగ్గిపోయింది. ఆమె ఎక్కువగా కనిపించలేదు. టాస్కుల్లోనూ ముందుండి దూకుడు ఎక్కువగా చూపించలేదు. హోస్ట్ నాగార్జున కూడా నైనికకు కొన్నిసార్లు వార్నింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ వీక్‌లో కనిపించిన నైనిక తనకు ఇప్పుడు కనిపించడం లేదని అన్నారు. ఆట పడిపోయిందని హెచ్చరించారు.
కొందరు హౌస్మేట్స్ నైనిక ఆట తగ్గిందని చెప్పారు. ఆడియన్స్ కూడా అదే అనుకున్నట్టున్నారు. దీంతో నైనికకు ఈవారం తక్కువ ఓటింగ్ పడింది. దీంతో హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
‘ఢీ’ షోలో డ్యాన్సర్‌గా నైనిక చాలా పాపులర్ అయ్యారు. అదిరిపోయే స్టెప్లతో మెప్పించారు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గానూ మారారు. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో స్ట్రాంగ్ కంస్టెంట్గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే, ఐదోవారంలోనే నైనికకు ఎదురుదెబ్బ తగిలింది.
ఈ వారం ఎలిమినేషన్ కోసం నైనిక, మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్ నామినేషన్లలో ఉన్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం ఉండనుంది. చివరగా నైనిక బయటికి వచ్చేయనున్నారని తెలుస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్లో ఇప్పటి వరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. తొలి వారం బెజవాడ బేబక్క, ఆ తర్వాతి వారం శేఖర్ బాషా బయటికి వచ్చారు. బిగ్‌బాస్‌నే తిట్టిన అభయ్ నవీన్ మూడో వారం ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారం సోనియా ఔట్ అయ్యారు. ఐదో వారం మిడ్వీక్లో ఆదిత్య ఎలిమినేట్ కాగా.. వీకెండ్లో నైనిక హౌస్ నుంచి బయటికి రానున్నారు.
బిగ్‌బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా గత సీజన్ల నుంచి కొందరు కంటెస్టెంట్లు రానున్నారు. ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. నైనిక వెళ్లిపోతే హౌస్‌లో ఎనిమిది మంది ఉంటారు. కొత్తగా మరో ఎనిమిది వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో రెండు క్లాన్లు కొనసాగే అవకాశం ఉంటుంది. అవినాశ్, హరితేజ, గంగవ్వ సహా మరికొందరు పేర్లు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.
టాపిక్