టాలీవుడ్‌లో కొత్త దర్శకులను, ప్రయోగాలను ప్రోత్సహించడంలో ముందు వరుసలో నిలుస్తుంటారు హీరో అక్కినేని నాగార్జున. సుదీర్ఘ సినీ ప్రయాణంలో యాభై మందికిపైగా దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగార్జున. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో అన్ని జానర్స్‌లో సినిమాలు చేశారు.
1986లో రిలీజైన విక్రమ్ సినిమాతో నాగార్జున సినీ ప్రయాణం మొదలైంది. బాలీవుడ్‌లో విజయవంతమైన హీరో మూవీ ఆధారంగా విక్రమ్ తెరకెక్కింది. నాగార్జున డెబ్యూ మూవీకి ఆయన సోదరుడు అక్కినేని వెంకట్ నిర్మాతగా వ్యవహరించారు. వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే శోభన హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విక్రమ్ మూవీ థియేటర్లలో వంద రోజులకుపైగా ఆడింది.
నాగార్జున డెబ్యూ మూవీ కోసం విక్రమ్ కంటే ముందు మరో కథను అనుకున్నారు నిర్మాత వెంకట్, డైరెక్టర్ మధుసూదనరావు. అదే చిరంజీవి విజేత సినిమా. అనిల్ కపూర్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ సాహెబ్‌కు రీమేక్‌గా విజేత రూపొందింది.
సాహెబ్ మూవీ వెంకట్, మధుసూదనరావులకు బాగా నచ్చిందట. నాగార్జున డెబ్యూ మూవీకి ఇదే కరెక్ట్ సినిమా అని భావించి రీమేక్ హక్కులను కొనేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేశారట. కానీ వారికి అల్లు అరవింద్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
అప్పటికే సాహెబ్ మూవీ హక్కులను అల్లు అరవింద్ కొనేశారట. చిరంజీవి హీరోగా విజేత పేరుతో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టేశారు. సాహెబ్ హక్కులు తమకు దక్కకపోవడంతో ఆ సినిమా స్థానంలో జాకీష్రాఫ్ హీరో మూవీ రీమేక్ రైట్స్ కొన్నారు అక్కినేని వెంకట్. నాగార్జున హీరోగా విక్రమ్ పేరుతో ఈ సినిమాను రూపొందించారు. అలా చిరంజీవి విజేతతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన నాగార్జున...విక్రమ్‌తో అడుగుపెట్టారు. విక్రమ్ కంటే విజేతనే పెద్ద హిట్‌గా నిలవడం గమనార్హం.
యాక్షన్ హీరో అనే ఇమేజ్ నుంచి బయటపడేందుకు చిరంజీవి ఈ సినిమా చేశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన విజేత సినిమాకు జంధ్యాల మాటలు రాశారు. భానుప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ శారద, జేవీ సోమయాజులు కీలక పాత్రల్లో నటించారు.
విజేత మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చైల్డ్ యాక్టర్‌గా నటించాడు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శారద కొడుకుగా చిన్న పాత్రలో కనిపించాడు. అల్లు అర్జున్‌తో పాటు అతడి సోదరుడు అల్లు బాబీ కూడా కొన్ని సీన్స్‌లో ఈ మూవీలో నటించడం గమనార్హం.
సంబంధిత కథనం