Nagarjuna New Movie: ధమాకా రైటర్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేయబోతున్న నాగార్జున
Nagarjuna New Movie: మరో కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు నాగార్జున. ఆ దర్శకుడు ఎవరంటే...
Nagarjuna New Movie: టాలీవుడ్‌లో కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో నాగార్జున ముందు వరుసలో ఉంటుంటారు. తాజాగా ఆయన మరో నూతన దర్శకుడికి అవకాశం ఇచ్చారు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్‌తో నాగార్జున ఓ సినిమా చేయబోతున్నాడు. సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, ఎక్కడకు పోతావు చిన్నవాడా సినిమాలతో రచయితగా విజయాల్ని అందుకున్నాడు ప్రసన్నకుమార్.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తోన్న ధమాకా సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. నాగార్జున సినిమాతో ప్రసన్నకుమార్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది ఈసినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మలయాళ సినిమాకు రీమేక్ ఇదని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం లేదని ప్రసన్నకుమార్ ఇటీవలే వెల్లడించారు. సొంత కథతోనే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.
ప్రసన్నకుమార్ గత సినిమాల తరహాలోనే ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. నాగార్జున, ప్రసన్నకుమార్ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలిసింది. గతంలో సమంత యూటర్న్, రామ్ ది వారియర్ సినిమాల్ని నిర్మించారు.
ప్రస్తుతం రామ్ బోయపాటి సినిమాతో పాటుగా నాగచైతన్య 22వ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బెజవాడ ప్రసన్నకుమార్ సినిమాతో పాటుగా గాడ్‌ఫాదర్ డైరెక్టర్ మోహన్‌రాజాతో ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు నాగార్జున.
ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు అఖిల్ అక్కినేని మరో హీరోగా నటిస్తున్నారు. కాగా ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. దసరాకు రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.