The Ghost Streaming in Netflix: ఓటీటీలోకి వచ్చిన నాగార్జున 'ఘోస్ట్'.. ఎందులో అంటే?-nagarjuna the ghost movie available now in netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nagarjuna The Ghost Movie Available Now In Netflix

The Ghost Streaming in Netflix: ఓటీటీలోకి వచ్చిన నాగార్జున 'ఘోస్ట్'.. ఎందులో అంటే?

Maragani Govardhan HT Telugu
Nov 02, 2022 11:20 AM IST

The Ghost Streaming in Netflix: టాలీవుడ్ స్టార్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్.

ది ఘోస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్
ది ఘోస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ (Twitter)

The Ghost Streaming in Netflix: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ పక్క సినిమాలతో పాటు బిగ్‌బాస్ లాంటి పాపులర్ టీవీ షోతోనూ విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవల నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. మాస్ ప్రేక్షకులను అలరించినప్పటికీ.. మిగిలిన వర్గాల వారికి పెద్దగా రుచించలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసింది చిత్రబృందం.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ది ఘోస్ట్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. బుధవారం(నవంబరు 2) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా.. ఓటీటీలో మాత్రం ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సోనాలి నారంగ్, పుశ్కర్ రామ్ మోహనరావు, శరత్ మారార్ నిర్మించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా చేసింది. భరత్-సౌరభ్ సంగీతాన్ని సమకూర్చారు. ముకేశ్ జీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.