PM Modi Nagarjuna: ప్రధాని నరేంద్ర మోదీకి థ్యాంక్స్ చెప్పిన నాగార్జున.. కారణం ఇదే!
Nagarjuna Thanks To Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్ నాగార్జున థ్యాంక్స్ చెప్పారు. ఐకానిక్ లెజెండ్ అయిన అక్కినేని నాగేశ్వరరావును గౌరవించినందుకు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Nagarjuna Thanks To Prime Minister Narendra Modi: ప్రధాని నరేందర్ మోదీకి టాలీవుడ్ కింగ్ నాగార్జున థ్యాంక్స్ చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. పీఎమ్ మోదీకి నాగార్జున ఎందుకు థ్యాంక్స్ చెప్పారు అని నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. అయితే, ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం నిర్వహిస్తారని తెలిసిందే.
బాలీవుడ్ డైరెక్టర్స్‌తోపాటు
ఈ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే, తాజా ఎపిసోడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, బాలీవుడ్ డైరెక్టర్ తపన్ సిన్హా, రాజ్ కపూర్‌ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ వారిని ప్రశంసించారు.
కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు
2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారి అమూల్యమైన సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించారు. "అక్కినేని నాగేశ్వరరావు గారు తన కృషితో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువల వ్యవస్థను ఎంతో గొప్పగా పెంపొందించారు" అని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు.
ఐకానిక్ లెజెండ్స్‌తోపాటు
దీంతో ఈ విషయం తెగ వైరల్ అయింది. అనంతరం తన తండ్రిని ప్రధానీ నరేంద్ర మోదీ కొనియాడటంపై నాగార్జున స్పందించారు. అందుకే నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున. "థ్యాంక్యూ గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఐకానిక్ లెజెండ్స్‌తోపాటు మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరంగా ఉంది. ఏఎన్నార్ దూరదృష్టి, ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి" అని నాగార్జున తెలిపారు.
హైదరాబాద్‌కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ
నాగార్జున ప్రధానికి థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఏఎన్ఆర్ తన ఏడు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు సినిమా వృద్ధి, విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించడం ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారు.
ఏఎన్నార్ అవార్డ్స్
తెలుగు, భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం, భారత ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి పురస్కరించుకుని ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. గోవాలోని IFFIలో ప్రత్యేక నివాళిగా ANR క్లాసిక్ చిత్రాలను ప్రదర్శించారు.
అమితాబ్, చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ అవార్డ్
ఏఎన్నార్ శతజయంతి జన్మదినాన్ని పురస్కరించుకుని, అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ ఒక గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ జాతీయ అవార్డుతో సత్కరించారు.