Nagarjuna Bigg Boss 8 Remuneration: బిగ్‍బాస్ 8 కోసం నాగార్జునకు భారీ రెమ్యూనరేషన్.. ఎంత పెరిగిందంటే!-nagarjuna taking huge remuneration for bigg boss telugu 8 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna Bigg Boss 8 Remuneration: బిగ్‍బాస్ 8 కోసం నాగార్జునకు భారీ రెమ్యూనరేషన్.. ఎంత పెరిగిందంటే!

Nagarjuna Bigg Boss 8 Remuneration: బిగ్‍బాస్ 8 కోసం నాగార్జునకు భారీ రెమ్యూనరేషన్.. ఎంత పెరిగిందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jul 25, 2024 10:09 AM IST

Bigg Boss 8 Telugu - Nagarjuna Remuneration: బిగ్‍బాస్ 8 సీజన్ త్వరలో రానుంది. ఈ సీజన్‍కు కింగ్ నాగార్జున రెమ్యునరేషన్ బాగా పెరిగిందని తెలుస్తోంది. ఈ సీజన్‍కు ఆయన ఎంత తీసుకుంటున్నారంటే..

Nagarjuna Bigg Boss 8 Remuneration: బిగ్‍బాస్ 8 కోసం నాగార్జునకు భారీ రెమ్యూనరేషన్.. ఎంత పెరిగిందంటే!
Nagarjuna Bigg Boss 8 Remuneration: బిగ్‍బాస్ 8 కోసం నాగార్జునకు భారీ రెమ్యూనరేషన్.. ఎంత పెరిగిందంటే!

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ రెడీ అవుతోంది. ఈ సీజన్‍పై ఇటీవలే స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. లోగోను కూడా రివీల్ చేసింది. దీంతో ఈ కొత్త సీజన్ కోసం బిగ్‍బాస్ ఫ్యాన్స్ చాలా నిరీక్షిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫన్ అంటూ స్టార్ మా అప్పుడే హైప్ క్రియేట్ చేస్తోంది. బిగ్‍బాస్ 8వ సీజన్‍కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అయితే, గత సీజన్‍తో పోలిస్తే ఈ నయా సీజన్‍కు ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందనే సమాచారం బయటికి వచ్చింది.

రెమ్యూనరేషన్ ఇదే..

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ కోసం నాగార్జున ఏకంగా రూ.30కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. 7వ సీజన్ కోసం రూ.20కోట్లను నాగ్ అందుకున్నారు. అయితే, ఈ కొత్త సీజన్ కోసం రూ.10కోట్లు అధికంగా రూ.30కోట్లను తీసుకుంటున్నారని సమాచారం చక్కర్లు కొడుతోంది. టీవీ షోకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేయడం సినీ సర్కిళ్లలో హాట్‍టాపిక్‍గా మారింది.

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో హోస్టింగ్‍లో కింగ్ నాగార్జున దుమ్మురేపేశారు. దూకుడుగానే వ్యవహరించారు. తప్పు చేసిన సమయాల్లో కంటెస్టెంట్లను గట్టిగానే నిలదీశారు. అంతకు ముందులా కాకుండా సీజన్ 7లో దూకుడైన స్వభావంతో హోస్ట్ చేసి ప్రేక్షకులను నాగార్జున మెప్పించారు. బిగ్‍బాస్ 8వ సీజన్‍లోనూ అదే జోష్ కొనసాగిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ప్రారంభం ఎప్పుడు?

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభం ఎప్పుడు అనేది ఉత్కంఠగా మారింది. ఆగస్టు చివరి లేకపోతే సెప్టెంబర్ మొదటి వారం ఈ షో మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ రెండో వారం అని కూడా వినిపిస్తోంది. త్వరలోనే డేట్‍ను ప్రకటించనుంది స్టార్ మా. అప్పటి వరకు ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగనుంది.

బిగ్‍బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్లు ఎవరనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యూం, యూట్యూబర్లు బంచిక్ బబ్లూ, అనీల్ గీలా, కమెడియన్ యాదమ రాజు, నటి సోనియా సింగ్, కుమారి ఆంటీ, యాంకర్ రితూ చౌదరి, నటుడు ప్రభాస్ శీను, కమెడియన్ యాదమరాజు పేర్లు వినిపిస్తున్నారు. మరికొందరు కూడా ఈ సీజన్లో పాల్గొంటారంటూ రూమర్లు వస్తున్నాయి. అదే అధికారికంగా సమాచారం బయటికి రాలేదు.

నాగార్జున లైనప్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమా చేస్తున్నారు. తమిళ స్టార్ ధనుష్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. నాగ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన నాగార్జున ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగించింది. చుట్టూ కరెన్సీ నోట్లు ఉన్న ట్రక్‍ల మధ్య వర్షంలో గొడుగు పట్టుకొని ఈ లుక్‍లో నాగార్జున కనిపించారు. బంగర్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణతో మరో మూవీకి నాగార్జున ఓకే చెప్పారని టాక్ ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‍లో రూపొందుతున్న కూలి చిత్రంలోనూ నాగార్జున ఓ కీలకపాత్ర చేయనున్నారనే రూమర్లు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం