Nagarjuna: ఊహించని పవర్‍ఫుల్ పాత్రలో నాగార్జున.. నవ మన్మథుడుకు ధీటుగా మన్మథుడు
Nagarjuna Dhanush 51 Update: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 64వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ అభిమానులకు ఖుషీ చేస్తున్నారు. తాజాగా ధనుష్ 51వ చిత్రంలో నాగార్జున పాత్ర గురించి చెబుతూ పోస్ట్ చేసింది మూవీ టీమ్.
Nagarjuna Role In Dhanush 51: ఎంతో కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు నాగార్జున (Nagarjuna). ఆయన్ను అభిమానులు ముద్దుగా కింగ్, టాలీవుడ్ మన్మథుడు అని పిలుచుకుంటారు. హీరోగా, నిర్మాతగా తెలుగు సినిమాల ద్వారా ఎంటర్టైన్ చేస్తున్న ఆయన బిగ్ బాస్‍తో బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ (Bigg Boss Telugu 7) సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానుండగా.. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా వదులుతున్నారు మేకర్స్.
ఆగస్ట్ 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు (Nagarjuna Birthday) కావడంతో ఆయనకు బర్త్ డే గిఫ్టుగా మూవీ గ్లింప్స్, అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే నాగ్99 మూవీ నా సామిరంగ (NAAG99) (Na Samiranga) టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ను వదిలారు. ఇందులో రగ్గడ్ లుక్‍లో నాగార్జున్ అదరగొట్టాడు. ఇక ఇదే కాకుండా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్షన్‍లో వస్తున్న ఓ చిత్రంలో నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన అప్డేట్ మేకర్స్ ఇచ్చారు.
తమిళ స్టార్ హీరో ధనుష్‍తో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ధనుష్51 (Dhanush51). శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‍పీ బ్యానర్‍లో సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, సొనాలి నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్‍కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలిపారు. "మా శేఖర్ కమ్ముల-ధనుష్ పాన్ ఇండియా చిత్రానికి ఓ పవర్ హౌజ్ కావాలి. మన కింగ్ కంటే మెరుగ్గా ఎవరున్నారు. హ్యాపీ బర్త్ డే నాగార్జున గారు. మీతో పనిచేసేందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం" అంటూ నిర్మాతలు స్పెషల్ నోట్ రాసుకొచ్చారు.
ధనుష్ 51వ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ రోల్ చేయనున్నారని అర్థమవుతోంది. అది విలన్ పాత్ర అయి కూడా ఉండవచ్చు. అదే జరిగితే నవ మన్మథుడు (ధనుష్-సమంత చిత్రం) అయినా ధనుష్‌ను ఢీకొట్టేందుకు టాలీవుడ్ మన్మథుడు రెడీ అయినట్లే. ఇదిలా ఉంటే ధనుష్ ఇటీవల సార్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ మూవీతో బిజీగా ఉన్నాడు. అనంతరం స్వీయదర్శకత్వంలో ధనుష్ 50 చిత్రం చేయనున్నాడు. వీటి తర్వాతే నాగార్జునతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ 51వ చిత్రం రానుందని తెలుస్తోంది.