నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయిన కుబేర మూవీకి అన్ని చోట్ల నుంచి ఫుల్ పాజిటివ్ రివ్యూలు పడుతున్నాయి. అయితే, కుబేర డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఇదివరకు నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా చేసిన విషయం తెలిసిందే.
సినిమా ప్రారంభానికి ముందు శేఖర్ కమ్ముల గురించి నాగ చైతన్యను అడిగితే ఏం చెప్పాడో నాగార్జున కుబేర రిలీజ్‌కు ముందు ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే, లోకేష్ కనగరాజ్-రజనీకాంత్ కాంబినేషన్ మూవీ కూలీలో తన క్యారెక్టర్‌పై చిన్ని అప్డేట్ ఇచ్చాడు నాగార్జున.
-నాగ చైతన్యని అడిగాను. ‘ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు' అని చెప్పాడు.
- కుబేర సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్.. అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్‌లో ఉంటాయి. సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబై, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్‌లో వర్క్ చేసాం.
-రష్మిక మందన్నా క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. తను చాలా అద్భుతంగా చేసింది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. ఆ కథలో చాలా రిప్రెషన్ క్యారెక్టర్ అది.
-సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ గారు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు. తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. చాలా పాషన్‌తో సినిమా తీశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములకి కావాల్సినది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.
-కూలీలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను.
సంబంధిత కథనం