రష్మికనే అసలు పాన్ ఇండియా సూపర్ స్టార్.. మేమెవరమూ చేయలేనిది ఆమె చేసింది: నాగార్జున కామెంట్స్-nagarjuna praises rashmika mandanna calling her real pan india star kubera movie promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రష్మికనే అసలు పాన్ ఇండియా సూపర్ స్టార్.. మేమెవరమూ చేయలేనిది ఆమె చేసింది: నాగార్జున కామెంట్స్

రష్మికనే అసలు పాన్ ఇండియా సూపర్ స్టార్.. మేమెవరమూ చేయలేనిది ఆమె చేసింది: నాగార్జున కామెంట్స్

Hari Prasad S HT Telugu

నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు సిసలు పాన్ ఇండియా స్టార్ ఆమెనే అని నాగ్ అనడం విశేషం. తమకు సాధ్యం కాని ఘనత ఆమె సాధించిందని అతడు అన్నాడు.

రష్మికనే అసలు పాన్ ఇండియా సూపర్ స్టార్.. మేమెవరమూ చేయలేనిది ఆమె చేసింది: నాగార్జున కామెంట్స్

ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పాన్ ఇండియా సూపర్‌స్టార్ ఎవరు? 'బాహుబలి', 'కల్కి 2898 ఏడీ' తర్వాత ప్రభాసా లేక 'పుష్ప'తో అల్లు అర్జునా లేక 'కేజీఎఫ్'తో యష్.. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రకారం వీళ్లెవరూ కాదు. ఎందుకంటే కన్నడ, తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో విజయవంతమైన సినిమాలతో తన తరంలోనే అతిపెద్ద పాన్ ఇండియా స్టార్‌ రష్మిక అన్నది నాగార్జున్ అభిప్రాయం.

రష్మికనే అతిపెద్ద పాన్-ఇండియా స్టార్

నాగార్జున మాటల ప్రకారం ఆ రియల్ పాన్ ఇండియా నటి రష్మిక మందన్నే. ఆమెతో కలిసి నాగ్.. ‘కుబేర’లో స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నాడు. గత మూడు సంవత్సరాలలో రష్మిక.. 'యానిమల్', 'పుష్ప 2: ది రూల్', 'ఛావా', 'సికందర్' వంటి చిత్రాలలో నటించింది. వీటిలో 'సికందర్' మినహా మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి.

'సికందర్' ప్రపంచవ్యాప్తంగా రూ.187 కోట్ల గ్రాస్ వసూళ్లతో తన థియేట్రికల్ రన్‌ను ముగించింది. కాగా, విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు, 'పుష్ప 2: ది రూల్' ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లకు పైగా, రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ చిత్రాలన్నింటిలో రష్మిక ఫిమేల్ లీడ్ గా నటించింది.

నాగార్జున ఏమన్నాడంటే..

'కుబేర' ప్రమోషన్లలో భాగంగా మూవీ టీమ్ ముంబై వెళ్లింది. ఈ సందర్భంగా రష్మికపై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించాడు. ఈవెంట్లో అతడు మాట్లాడుతూ.. "ఈ అమ్మాయి, ఈ అమ్మాయి టాలెంట్ కు ఒక పవర్‌హౌస్. అంటే, గత మూడు సంవత్సరాలలో ఆమె ఫిల్మోగ్రఫీని చూస్తే, అద్భుతం. మనలో ఎవరమూ రూ.2000-రూ.3000 కోట్ల నటులు కాదు. ఈమె ఒక్కతే. ఈమె మనందరినీ అధిగమించింది" అని అన్నాడు.

నాగార్జున ఇంకా ఏమన్నాడంటే.. "రష్మిక, నీతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నీతో గతంలో పని చేశాను. కానీ ఈసారి, డబ్బింగ్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత, నేను వెంటనే నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. నేను డబ్బింగ్ థియేటర్ నుంచే నీకు ఫోన్ చేశాను. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా ఉంది. ఆమె మీ అందరినీ చాలా నవ్విస్తుంది. ఆమె చాలా అద్భుతంగా ఉంది. ఆమె సహజంగా ఉంటుంది. రష్మిక, ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు" అని అన్నాడు.

కుబేర మూవీ గురించి..

'కుబేర' ఓ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రష్మిక, నాగార్జునతో పాటు ధనుష్, సయాజీ షిండే కూడా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలోకి రానుంది. 'కుబేర' తర్వాత రష్మిక హారర్-కామెడీ మూవీ 'థామా' విడుదలకు సిద్ధంగా ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం