Nagarjuna Next Movie: పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నాగార్జున నెక్స్ట్ మూవీ
Nagarjuna Next Movie: నాగార్జున హీరోగా ధమాకా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు మొదలుకానుందంటే...
Nagarjuna Next Movie: ది ఘోస్ట్ తర్వాత నాగార్జున నెక్స్ట్ మూవీ ఏమిటన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ది ఘోస్ట్ రిజల్ట్‌ను దృష్టిలో పెట్టుకొని తదుపరి సినిమా కథ విషయంలో నాగార్జున ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. సీరియస్ సినిమా కంటే కామెడీ జోనర్‌కే నాగార్జున ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాగార్జున తన తదుపరి సినిమాను ధమాకా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథా నేపథ్యం 1970 - 80 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని అంటున్నారు.
ఇందులో నాగార్జున క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలిసింది. మార్చి లో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా నాగార్జున సినిమాతోనే ప్రసన్నకుమార్ బెజవాడ మెగాఫోన్ పట్టబోతున్నాడు. ధమాకా, నేను లోకల్, సినిమా చూపిస్త మావతో పాటు పలు సినిమాలకు రచయితగా పనిచేశాడు ప్రసన్నకుమార్ బెజవాడ.
ఈ సినిమాతో పాటు గాడ్‌ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మల్టీస్టారర్ సినిమాలో అఖిల్ అక్కినేని మరో హీరోగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.