Akhil: స్కానింగ్‌లో అఖిల్‌ను ఆడపిల్ల అని చెప్పారు, నిఖిత అని పేరు పెట్టాం, కాళ్లు ముడుచుకున్నాడేమో: నాగార్జున కామెంట్స్
Nagarjuna About Akhil Akkineni Birth Scanning Report: అఖిల్ అక్కినేని థియేటర్ ఆర్టిస్ట్ జైనబ్ రవ్జీని త్వరలో పెళ్లాడనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల్ అక్కినేని బర్త్ స్కానింగ్ రిపోర్ట్ గురించి టాలీవుడ్ కింగ్ నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nagarjuna About Akhil Akkineni Birth Scanning Report: సిసీంద్రీగా తెలుగులో చిన్న తనంలోనే ఎంతోమందిని అలరించాడు అక్కినేని అఖిల్. ఆ తర్వాత మనం సినిమాలో చిన్న కెమియోతో మరింతగా అట్రాక్ట్ చేశాడు. ఇక 2015లో హీరోగా అఖిల్ మూవీతో డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ మంచి హిట్ కోసం తహతహలాడాడు అక్కినేని అఖిల్.
థియేటర్ ఆర్టిస్ట్
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో కాస్తా గాడిలో పడిన అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ఇక గతేడాది నవంబర్ 26న థియేటర్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ జైనబ్ రవ్జీతో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది మార్చి 24 అఖిల్-జైనబ్ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
అఖిల్ బర్త్ స్కానింగ్ రిపోర్ట్
ఈ నేపథ్యంలో గతంలో అఖిల్ అక్కినేని బర్త్ స్కానింగ్ రిపోర్ట్‌పై తండ్రి, టాలీవుడ్ కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమల కడుపులో అఖిల్ ఉన్నప్పుడు అమెరికన్ డాక్టర్స్ ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్, ఆ తర్వాత డెలివరీ చూసి షాక్ అయినట్లు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆడపిల్ల అని చెప్పారు
గతంలోని ఈ వీడియోను కొన్నిరోజులుగా మీమ్స్ యాడ్ చేస్తూ ఫన్నీగా క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియోలో "బేబీ స్కానింగ్ చేసి చూస్తే ఆడపిల్ల అని చెప్పేశారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అయి" అని నాగార్జున చెబుతుంటే.. "ఎవరు అఖిల్‌నా" అని హోస్ట్ అడిగారు. "ఆ" అని చెప్పిన నాగార్జున "ఫ్రాక్స్ కొని.. డ్రెస్సులన్నీ కొనేసి.. అయి కొని, ఇయి కొని" చెప్పుకొచ్చారు.
పేరు కూడా పెట్టేశాం
ఇంతలో "బేబీకి కావాల్సినవన్నీ కొనేశారు" అని హోస్ట్ మధ్యలో అన్నారు. "రిటర్న్ టికెట్ ఆడపిల్ల పేరు మీద బుక్ చేసి నిఖిత అని పేరు పెట్టేసి" అని నాగార్జున చెప్పారు. "అప్పుడే పేరు కూడా ఫిక్స్ అయిపోయారు" అని హోస్ట్ అన్నారు. "హా పేరు పెట్టుసుకుని, అన్నీ పెడితే.." అని నాగార్జున చెప్పబోతుంటే.. "మరి అమెరికాలో స్కానింగ్‌లో అంత తప్పు ఎలా చెప్పారు" అని యాంకర్ ప్రశ్నించారు.
కాళ్లు ముడుచుకున్నాడేమో
"తప్పు కావడానికి 5 శాతం ఛాన్స్ ఉందంట అండి. మరి వీడు కాళ్లు ముడుచుకుని కూర్చున్నాడో, ఏం చేశాడో తెలియదండి" అని నాగార్జున చెప్పారు. దానికి హోస్ట్ తెగ నవ్వేశారు. తర్వాత "అందుకే చెబుతున్నాను నేను అంతలా సర్‌ప్రైజ్ అయ్యాను. డెలివరీ రూమ్‌లో నేనున్నాను. అఖిల్‌ను చూసిన మొదటి వ్యక్తిని నేనే. చూసి హా.. మొగ పిల్లాడా అని షాక్ అయ్యాను. సర్‌ప్రైజ్ షాక్" అని నాగార్జున అన్నారు.
వీడొచ్చాడేంటీ
"నిఖిత వస్తుందనుకుంటే అఖిల్ వచ్చాడేంటీ అని" అని హోస్ట్ నవ్వుకుంటూ అన్నారు. దానికి "హా వీడొచ్చాడేంటీ" అని నాగార్జున కూడా నవ్వుతూ చెప్పారు. దీనికి ఫన్నీ రియాక్షన్స్ యాడ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సంబంధిత కథనం