అఖిల్ అక్కినేని పెళ్లి బరాత్ లో నాగార్జున, నాగ చైతన్య డ్యాన్స్.. హల్ చల్ చేస్తున్న వీడియోలు-nagarjuna and naga chaitanya dance at akhil akkineni wedding baraat videos goes viral sumanth sushanth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అఖిల్ అక్కినేని పెళ్లి బరాత్ లో నాగార్జున, నాగ చైతన్య డ్యాన్స్.. హల్ చల్ చేస్తున్న వీడియోలు

అఖిల్ అక్కినేని పెళ్లి బరాత్ లో నాగార్జున, నాగ చైతన్య డ్యాన్స్.. హల్ చల్ చేస్తున్న వీడియోలు

అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవ్జీని పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా వీళ్ల వివాహం జరిగింది. ఈ పెళ్లి బరాత్ లో అఖిల్ తండ్రి నాగార్జున, అన్నయ్య నాగ చైతన్య డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

అఖిల్ అక్కినేని దంపతులు

అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ పెళ్లి శుక్రవారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి బరాత్ లో నాగచైతన్య, నాగార్జున డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని-జైనాబ్ వివాహం సంప్రదాయ తెలుగు శైలిలో జరిగింది. అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున, అమల అక్కినేని ఫోటోలు, ఐవరీ సిల్క్ దుస్తుల్లో ఉన్న ఈ జంట ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లికి అఖిల్ సింపుల్ అండ్ ట్రెడిషనల్ పంచా ఎంచుకోగా, జైనబ్ డైమండ్ జ్యువెలరీతో కూడిన చీరను ధరించింది.

డ్యాన్స్ వీడియోలు

అఖిల్, జైనాబ్ పెళ్లి బరాత్ లో అక్కినేని ఫ్యామిలీ ఆనందంగా స్టెప్పులేసింది. అఖిల్ తండ్రి నాగార్జున, అన్నయ్య నాగ చైతన్య సంతోషంతో ఊగిపోతూ డ్యాన్స్ చేశారు. సుశాంత్ కూడా డ్యాన్స్ తో అదరగొట్టాడు. సుమంత్, సుశాంత్, నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ కూడా వివాహానికి హాజరయ్యారు. ఓ వీడియోలో సుశాంత్ ధూం ధామ్ డాన్స్ చేస్తూ కనిపించాడు.

పలువురు ప్రముఖులు ముందుగానే వచ్చి అఖిల్ అక్కినేని పెళ్లి బారాత్ లో పాల్గొన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కొణిదెల, ప్రశాంత్ నీల్ వంటి వారు ముందుగానే పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు.

తండ్రి, అన్నయ్యతో స్టెప్పులు

అఖిల్ అక్కినేని పెళ్లి కావడం పట్ల నాగార్జున, నాగ చైతన్య ఫుల్ హ్యాపీతో ఉన్నారు. ఆ ఆనందం వీళ్ల డ్యాన్స్ లో కనిపించింది. ఓ వీడియోలో అఖిల్ తో కలిసి తండ్రి నాగార్జున, అన్నయ్య నాగ చైతన్యతో డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

జైనాబ్ గురించి

అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ రవ్జీ హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. ఆమె ముంబైకి చెందిన కళాకారిణి, వ్యాపారవేత్త. సుగంధ ద్రవ్యాల వ్యాపారి కూడా. అఖిల్, జైనాబ్ తమ రిలేషన్షిప్ ను చాలా కాలం పాటు గోప్యంగా ఉంచారు. రెండేళ్లుగా వీళ్లు ప్రేమించుకుంటున్నారు. ఈ జంట గత ఏడాది నిశ్చితార్థానికి ముందు డేటింగ్ చేసినట్లు తెలుస్తోంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం